దివ్యాంగులకు సర్కార్ ఆసరా
మంత్రి నారాల లోకేష్ భరోసా
అమరావతి – ఏపీ కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు ఆసరాగా నిలుస్తోందని అన్నారు మంత్రి నారా లోకేష్. మంగళవారం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్బంగా శుభాకాంక్షలు తెలిపారు. విభిన్న ప్రతిభావంతులకు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని చెప్పారు.
త్రిచక్ర మోటారు వాహనాలు, ఆర్థిక ఆసరా అందజేసినట్లు తెలిపారు. తాము పవర్ లోకి వచ్చాక పింఛన్ రూ. 6000కి పెంచినట్లు స్పష్టం చేశారు. దివ్యాంగులను అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు నారా లోకేష్.
గత ప్రభుత్వం దివ్యాంగుల పట్ల వివక్షా పూరితంగా వ్యవహరించిందని ఆరోపించారు. దీని వల్ల వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని వాపోయారు. తాను యువ గళం పాదయాత్ర చేపట్టిన సమయంలో విభిన్న ప్రతిభావంతులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించానని తెలిపారు.
తాము కొలువు తీరిన వెంటనే దివ్యాంగుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్నం చేశామని పేర్కొన్నారు మంత్రి.