గురుకులాల్లో సమస్యలు పరిష్కరిస్తా
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
అమరావతి – ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల భరోసా ఇచ్చారు . మంగళవారం ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకులాల్లో విధులు నిర్వహిస్తున్న ఔట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు, గెస్ట్ లెక్చరర్లు మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం వద్ద తనను కలిశారు. తమ సమస్యలు పరిష్కరించాలని విన్నవించారు.
గత 15 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న తమను కాంట్రాక్టు లెక్చరర్లుగా మార్పు చేసి 2022 పీఆర్సీ ప్రకారం జీతాలు చెల్లించాలని కోరారు. శాంక్షన్డ్ పోస్టుల్లోనే తాము సంవత్సరాల తరబడి పని చేస్తున్నామని తెలిపారు.
అతి తక్కువ జీతాలతో ఇస్తూ తమ శ్రమను దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్య పట్ల పవన్ కళ్యాణ్ గారు సానుకూలంగా స్పందించారు. పూర్తి పరిశీలన నిమిత్తం సంఘం నాయకులతో ప్రత్యేకంగా చర్చించారు. ఈ సందర్బంగా సంబంధిత అధికారులతో మాట్లాడారు. వెంటనే వీరి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు ఏపీ డీప్యూటీ సీఎం.