మార్పునకు పట్టం నియంతకు మంగళం
డిసెంబర్ 3 చరిత్రలో చిరస్మరణీయం
హైదరాబాద్ – పదేళ్ల అరాచక పాలనకు చరమగీతం పాడిన రోజు. సంబండ వర్ణాల ప్రజలు ముక్త కంఠంతో నియంత కేసీఆర్ ను ఇంటికి సాగనింపిన రోజు డిసెంబర్ 3. సరిగ్గా ఇవాల్టితో ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన అనుముల రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగుర వేసిన రోజు.
గడీల పాలనకు పుల్ స్టాప్ పెట్టిన రోజు. ప్రజలంతా స్వేచ్ఛాయుత వాయువులు పీల్చుకున్న రోజు . అరాచక పాలన సాగదని, దౌర్జన్యం చెల్లుబాటు చెల్లదని చెప్పిన అపురూపమైన రోజు ఇవాళ. అవినీతి, అక్రమాలపై ఎక్కు పెట్టిన బాణం ఓటు అనే ఆయుధంతో ఇంటికి సాగనింపిన రోజు.
ఈ సందర్బంగా సీఎం అనుముల రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మార్పునకు జై కొట్టి..ప్రజా పాలనకు జై కొట్టిన రోజు అని పేర్కొన్నారు. మలి విడత తెలంగాణ మహోద్యమానికి శ్రీకాంతాచారి అమరత్వ ఆశయానికి అంకురార్పణ జరిగిన రోజు ఈరోజు అని అన్నారు.
కల్వకుంట్ల కుటుంబాన్ని, గులాబీ దొరల అహంకారానికి చెంప ఛెల్లుమనించి గెలిచిన రోజు..ప్రజాస్వామ్య పొద్దును ముద్దాడిన రోజు అని స్పష్టం చేశారు.