తిరుమలలో జలాశయాల వివరాలు
వెల్లడించిన టీటీడీ ఈవో శ్యామల రావు
తిరుమల – తిరుమలలో గత మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలకు పాప వినాశనం, ఆకాశగంగ, గోగర్భం, కుమారధార, పసుపుధార జలాశయాల్లో నీటిమట్టం పూర్తి స్థాయికి చేరుకుంది. ప్రస్తుత నీటి నిల్వలు తిరుమలకు 270 రోజుల తాగునీటి అవసరాలకు సరి పోతాయని వెల్లడించారు టీటీడీ ఈవో జె. శ్యామల రావు.
మంగళవారం 12 గంటల సమయానికి జలాశయాల నీటిమట్టం వివరాలు ఇలా ఉన్నాయి.
1) పాపవినాశనం డ్యామ్ :- 697.00 మీ.
FRL :- 697.14 మీ.
నిల్వ సామర్థ్యం :- 5240.00 లక్షల గ్యాలన్లు.
ప్రస్తుత నిల్వ :- 5192.54 లక్షల గ్యాలన్లు.
2) గోగర్భం డ్యామ్ :- 2894.00 అడుగులు
FRL :- 2894.00 అడుగులు
నిల్వ సామర్థ్యం :- 2833.00 లక్షల గ్యాలన్లు.
ప్రస్తుత నిల్వ :- 2833.00 లక్షల గ్యాలన్లు.
3) ఆకాశగంగ డ్యామ్ :- 864.50 మీ
FRL :- 865.00 మీ.
నిల్వ సామర్థ్యం :- 685.00 లక్షల గ్యాలన్లు.
ప్రస్తుత నిల్వ :- 645.00 లక్షల గ్యాలన్లు.
4) కుమారధార డ్యామ్ :- 895.50.00 మీ.
FRL :- 898.24మీ.
నిల్వ సామర్థ్యం :- 4258.98 లక్షల గ్యాలన్లు.
ప్రస్తుత నిల్వ :- 3440.32 లక్షల గ్యాలన్లు.
5) పసుపుధార డ్యామ్ :- 896.50 మీ.
FRL :- 898.24మీ.
నిల్వ సామర్థ్యం :- 1287.51 లక్షల గ్యాలన్లు.
ప్రస్తుత నిల్వ :- 966.31 లక్షల గ్యాలన్లు.