భావోద్వేగానికి లోనైన వినోద్ కాంబ్లీ
సచిన్ టెండూల్కర్ ను చూసి కంటతడి
ముంబై – భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లి గుర్తు పట్టని విధంగా తయారయ్యాడు. ఒకప్పుడు సచిన్ టెండూల్కర్ తో కలిసి చిన్నప్పటి నుంచి కలిసి ఆడారు. కానీ అనూహ్యంగా తన కెరీర్ ను పాడు చేసుకున్నాడు కాంబ్లి. ప్రస్తుతం బీసీసీఐ నెల నెలా ఇచ్చే పెన్షన్ తో బతుకుతున్నాడు.
తాజాగా ముంబైలో తమ క్రికెట్ గురువు రమాకాంత్ అచ్రేకర్ విగ్రహ ఆవిష్కరణ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు వినోద్ కాంబ్లీ , సచిన్ టెండూల్కర్. సచిన్ ను చూసి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. తను గత కొంత కాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నాడు.
ఒకప్పుడు భారత దేశ క్రికెట్ లో కీలకమైన ఆటగాడిగా ఉన్నాడు కాంబ్లి. సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చాడు. కాగా కాంబ్లితో కలిసి సచిన్ కోచ్ రమాకాంత్ అచ్రేకర్ స్మారక చిహ్నాన్ని ఛత్రపతి శివాజీ మహారాజ్ పార్క్ లో ఆవిష్కరించారు.
అంతకు ముందు కాంబ్లి, సచిన్ ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. అయితే కాంబ్లి ప్యాసా సినిమా లోని బాలీవుడ్ పాటను పాడాడు. విచిత్రం ఏమిటంటే కాంబ్లి వయసు 52 ఏళ్లు. కానీ అతడిని చూస్తుంటే వయస్సు మీద పడినట్లు కనిపిస్తోంది. స్వీయ నష్టం చూస్తుంటే బాధగా ఉంది. అతడి జీవితం , ప్రస్తుత పరిస్థితి రాబోయే క్రికెటర్లకు ఒక హెచ్చరిక లాంటిదని చెప్పక తప్పదు.
అతని పరిస్థితి మరియు అతను చేసుకున్న స్వీయ నష్టం చూస్తుంటే బాధగా ఉంది. ప్రస్తుత మరియు రాబోయే క్రికెటర్లకు ఒక హెచ్చరిక.