పోలీసు కుటుంబాలకు సాయం పెంపు
ప్రకటించిన మంత్రి వంగలపూడి అనిత
అమరావతి – ఏపీ ప్రభుత్వం పోలీసు కుటుంబాలకు తీపి కబురు చెప్పింది. ఈ మేరకు బుధవారం ఇందుకు సంబంధించి సంబంధిత హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత కీలక ప్రకటన చేశారు.
విధి నిర్వహణలో అమరులైన పోలీసు కుటుంబాలకు అందించే తక్షణ సహాయాన్ని లక్ష రూపాయలకు పెంచడం జరిగిందన్నారు. ఈ మేరకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. విధుల్లో కీలకంగా వ్యవహరిస్తూ, ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
మానవతా దృక్ఫథంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు . ప్రజా క్షేమమే పరమావధిగా పోలీసులు అహర్నిశలు విధులు నిర్వహిస్తున్నారని కొనియాడారు మంత్రి అనిత వంగలపూడి అనిత. సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచనలను ఆచరణలో పెడుతూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. అంతిమ సంస్కారాల కోసం తక్షణ సాయంగా రూ. 25 వేలు ఇచ్చే వారని, కానీ తాము మరో 75 వేలు అదనంగా పెంచామన్నారు.