NEWSANDHRA PRADESH

అమ‌రావ‌తిలో భూమి కొనుగోలు చేశా

Share it with your family & friends

త్వ‌ర‌లోనే పూజ చేస్తాన‌ని ప్ర‌క‌ట‌న

అమ‌రావ‌తి – ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. అమ‌రావ‌తిలో నివాసం ఉండేందుకు భూమిని కొనుగోలు చేశాన‌ని చెప్పారు. త్వ‌ర‌లోనే శంకుస్థాప‌న చేస్తాన‌ని వెల్ల‌డించారు. బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

ఇక కాకినాడ విష‌యంలో జ‌గ‌న్ రెడ్డి తీరును ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని అన్నారు. పారిశ్రామిక‌వేత్త‌ల‌ను బెదిరించి ,వాటాలు తీసుకునే నీచ‌మైన సంస్కృతి త‌న‌దంటూ మండి ప‌డ్డారు. ఈ మొత్తం వ్య‌వ‌హారంపై విచార‌ణ జ‌రిగి తీరుతుంద‌న్నారు.

కాకినాడ‌, ఇత‌ర పోర్టుల ద్వారా అక్ర‌మంగా బియ్యం ర‌వాణా జ‌రుగుతున్న సంగ‌తిని త‌న‌కు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల తెలియ చేశార‌ని అన్నారు. ఈ మొత్తం వ్య‌వ‌హారం విని తాను విస్తు పోయాన‌ని చెప్పారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. జ‌గ‌న్ రెడ్డి గ‌త 5 ఏళ్ల‌లో అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేయ‌రాని అక్ర‌మాల‌న్నీ చేశాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు.