NEWSANDHRA PRADESH

జ‌గ‌న్ రెడ్డీ అమెరికా క‌థేంటి..?

Share it with your family & friends

నిప్పులు చెరిగిన వైఎస్ ష‌ర్మిల

అమ‌రావ‌తి – ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. ఆమె మ‌రోసారి జ‌గ‌న్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. బుధ‌వారం ఆమె మీడియాతో మాట్లాడారు. అదానీతో జ‌రిగిన విద్యుత్ ఒప్పందాల్లో రూ. 1750 కోట్ల మేర ముడుపులు అందుకున్నట్టు అమెరికా దర్యాప్తు సంస్థ చెప్తోంద‌న్నారు. జగన్ అయితే త‌న‌ పేరు ఎక్కడైనా ఉందా తెలివిగా మాట్లాడుతున్నారంటూ మండిప‌డ్డారు. మ‌రి 2021లో అప్పటి సీఎం అంటే జగన్ కాక మరెవరు ఉన్నారో త‌నే చెప్పాల‌న్నారు.

టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదానీ డీల్ పెద్ద కుంభకోణం అని ఆనాడు ప‌య్యావుల కేశ‌వ్ ఆందోళన చేశార‌ని చెప్పారు. . కోర్టుకు సైతం వెళ్లారని మ‌రి ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు క‌దా చంద్ర‌బాబు నాయుడు ఎందుకు చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేదంటూ నిల‌దీశారు వైఎస్ ష‌ర్మిల .

చ‌ర్య‌లు తీసుకునేందుకు చంద్రబాబు భయపడుతున్నారా..? ఒప్పందం రద్దులో ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. లాంగ్ టర్మ్ డీల్ చేయకూడదని తెలిసినా జగన్ ఎందుకు అమలు చేశారని అన్నారు.

ఈనెల నుంచే ఈ విద్యుత్ భారాలు ప్రజలపై మోపారని వాపోయారు. అక్రమాలన్ని స్పష్టంగా తెలిసినా స్పందించరా..? ఈ ఒప్పందాలు రద్దు చేయాలని చంద్రబాబుని‌ డిమాండ్ చేస్తున్నాం. కేంద్రం జోక్యం చేసుకుని అదానీ, జగన్ మధ్య ఒప్పందాలు రద్దు చేయాల‌ని డిమాం్డ చేశారు.