NEWSTELANGANA

ఏసీబీకి చిక్కిన మార్కెటింగ్ ఆఫీస‌ర్

Share it with your family & friends

రెడ్ హ్యాండెడ్ గా ప‌ట్టుకున్న అధికారులు
నిర్మ‌ల్ జిల్లా – తెలంగాణ అవినీతి నిరోధ‌క శాఖ దూకుడు పెంచింది. ఎక్క‌డిక‌క్క‌డ దాడులు చేస్తోంది. త‌నిఖీలు చేప‌డుతోంది. బుధ‌వారం ఆక‌స్మికంగా ఆర్టీఏ చెక్ పోస్టుల‌ను త‌నిఖీ చేసింది. రూ. 1.78 ప‌ట్టుకుంది. ఇది ప‌క్క‌న పెడితే ఇవాళ మ‌రో అవినీతి చేప చిక్కింది.

నిర్మ‌ల్ జిల్లా మార్కెటింగ్ అధికారి రెడ్ హ్యాండెడ్ గా ప‌ట్టుబ‌డ్డాడు. ఫిర్యాదుధారునికి తూకందారు లైసెన్స్ జారీ చేయడం కోసం రూ. 10000 లంచం ఇవ్వాల‌ని డిమాండ్ చేశాడు. త‌న వ‌ద్ద అంత లేవ‌ని, కేవ‌లం రూ. 7000 మాత్ర‌మే ఉన్నాయ‌ని తెలిపాడు. దీనికి ఓకే చెప్ప‌డంతో బాధితుడు ఏసీబీని ఆశ్ర‌యించారు.

దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఏడు వేల రూపాయ‌లు తీసుకుంటుండ‌గా ప‌ట్టుకున్నారు మార్కెటింగ్ అధికారి తంగ‌డిప‌ల్లి శ్రీ‌నివాస్ ను. ఇదిలా ఉండ‌గా అవినీతిని ప్రోత్స‌హించినా లేదా లంచం డిమాండ్ చేసినా, కావాల‌ని ఒత్తిడి చేసినా వెంట‌నే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబ‌ర్ కు ఫోన్ చేయాల‌ని కోరింది ఏసీబీ.

“ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయండి” అని కోరింది.