NEWSTELANGANA

ప్ర‌తి సోమ‌వారం హైడ్రా ప్ర‌జావాణి

Share it with your family & friends

ప్ర‌క‌టించిన క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్

హైద‌రాబాద్ – హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఈ మేర‌కు తాజాగా పెద్ద ఎత్తున ఆక‌మ‌ణ‌ల గురించి ఫిర్యాదులు వస్తుండ‌డంతో ప్ర‌తి సోమ‌వారం ప్ర‌జావాణి ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించారు.

ఇందులో భాగంగా ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం ఈ నిర్ణ‌యం తీసుకోవాల్సి వ‌చ్చింద‌ని తెలిపారు క‌మిష‌న‌ర్. ఇందుకు సంబంధించి ప్రతి సోమవారం ప్రజావాణి తరహాలో ఫిర్యాదులు స్వీకరించడానికి సిద్ధం కావాల‌ని స్ప‌ష్టం చేశారు.

హైద‌రాబాద్ లోని బుద్ధ‌ భవన్‌ లో నేరుగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించడం జ‌రుగుతుంద‌ని పేర్కొన్నారు. బుధ‌వారం ఎక్స్ వేదిక‌గా ఈ విష‌యం వెల్ల‌డించారు. అధికారులు.. చెరువులు, నాలాలు, పార్కుల ఆక్రమణలపై అర్జీలు ఇవ్వవచ్చని ప్రకటించారు. దీని వ‌ల్ల ఎక్క‌డికి వెళ్లాలో, ఎవ‌రికి చెప్పుకోవాల‌నే దానిపై నెల‌కొన్న సందిగ్ద‌త‌కు చెక్ పెట్టారు క‌మిష‌న‌ర్.