NEWSANDHRA PRADESH

ఇక నుంచి జ‌గ‌న్ రెడ్డి జ‌నం బాట

Share it with your family & friends

ప్ర‌భుత్వంపై పోరు బాట ప్ర‌క‌ట‌న

తాడేప‌ల్లి గూడెం – వైసీపీ బాస్ , మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఇక నుంచి జ‌నంలోకి వెళ‌తాన‌ని, జిల్లాలు ప‌ర్య‌టిస్తాన‌ని వెల్ల‌డించారు. బుధ‌వారం తాడేప‌ల్లిగూడెంలో వైసీపీ కీల‌క స‌మావేశం జ‌రిగింది. ఈ సంద‌ర్బంగా ఏపీ కూట‌మి స‌ర్కార్ బ‌క్వాస్ అంటూ మండిప‌డ్డారు.

రైతుల సమస్యలు, కరెంటు ఛార్జీల మోత..ఫీజు రీయింబర్స్‌మెంట్‌.. మూడింటిపై ఆందోళన చేప‌డ‌తామ‌న్నారు. ప్రభుత్వాన్ని నిలదీయడం. వినతి పత్రాల సమర్పిస్తామ‌న్నారు.

ఆరు నెలల్లోనే కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత నెల‌కొంద‌న్నారు. ఇంతటి వ్యతిరేకత ఎప్పుడూ, ఎక్కడా చూడలేదన్నారు. సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌.. గాలికెగిరి పోయాయంటూ ఎద్దేవా చేశారు.
చెప్పిన అబద్దాలు, చేసిన మోసాలు ప్రజల్లో కోపంగా మారాయని అన్నారు.

ఎక్కడికక్కడ ప్రజలు ప్రశ్నించే పరిస్థితి వచ్చిందని, రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నీరు గారి పోయాయ‌ని అన్నారు. రైతులు, విద్యార్థులు, అన్ని వర్గాలు ఇబ్బంది పడుతున్నాయని వాపోయారు జ‌గ‌న్ రెడ్డి.

ప్రశ్నించే వారిపై కేసులు పెడుతున్నారని, రాష్ట్రమంతటా భయాందోళనలు నెలకొన్నాయని ఈ ప‌రిస్థితి మారాల‌న్నారు. యథేచ్ఛగా రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడుస్తోందన్నారు. మద్యం, ఇసుక, పేకాట క్లబ్బుల్లో అధికార పార్టీ బిజీగా మారింద‌న్నారు. గ్రామాల్లో బెల్టుషాపులకు బహిరంగ వేలం వేస్తున్నారని మండిప‌డ్డారు.

ఎమ్మెల్యేలకు కప్పం కడితే తప్ప ఏ పని జరగ‌డం లేదన్నారు. రౌడీ మామూళ్ల కోసం గొడవలు జరుగుతున్నాయని వాపోయారు. ఆరు నెలల్లోనే రాష్ట్రంలో దారుణ రాక్షస పాలన కొన‌సాగుతోంద‌న్నారు.