ఎస్టీఎఫ్ డైరెక్టర్ గా సారా టెండూల్కర్
సంతోషం వ్యక్తం చేసిన సచిన్ టెండూల్కర్
ముంబై – ఎవరీ సారా టెండూల్కర్ అనుకుంటున్నారా. ప్రముఖ మాజీ క్రికెటర్ సచిన్ రమేష్ టెండూల్కర్ కూతురు. కొడుకు అర్జున్ టెండూల్కర్. ప్రస్తుతం ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్నాడు. ఎడమ చేతి వాటం బౌలర్. బ్యాటర్ కూడా.
ఇక కూతురు సారా టెండూల్కర్ లండన్ లో చదువుతోంది. ఆమె తమ కుటుంబం ఏర్పాటు చేసిన టెండూల్కర్ ఫౌండేషన్ లో ఇండియా డైరెక్టర్ గా చేరింది. ఈ విషయాన్ని స్వయంగా తండ్రి ..సచిన్ టెండూల్కర్ వెల్లడించారు. ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని పంచుకున్నారు.
సారా టెండూల్కర్ యూనివర్సిటీ కాలేజ్ లండన్ నుండి క్లినికల్ , పబ్లిక్ హెల్త్ న్యూట్రిషన్‌లో మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉంది. క్రీడలు, ఆరోగ్య సంరక్షణ, విద్య ద్వారా భారతదేశాన్ని శక్తివంతం చేయడానికి తన ప్రయాణం మొదలు పెడుతుందని ఆశా భావం వ్యక్తం చేశారు.
మొదటి నుంచి సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొనడం సారా టెండూల్కర్ కు, తల్లికి ఇష్టం. క్రికెట్ పరంగా సచిన్ లెజండ్ గా ఉన్నాడు.