మోసం చేసినోళ్లు ప్రశ్నిస్తే ఎలా – సీఎం
కేసీఆర్ ను ఏకి పారేసిన రేవంత్ రెడ్డి
కరీంనగర్ జిల్లా – ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ఏడాది పాలన సందర్బంగా విజయోత్సవ సభకు హాజరయ్యారు. ఈ సందర్బంగ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. బీఆర్ఎస్ చీఫ్ , మాజీ సీఎం కేసీఆర్ ను ఏకి పారేశారు.
రూ.1 లక్షా 2 వేల కోట్లు కాళేశ్వరం కోసం ఖర్చు పెట్టారని ఇంతకు ఆ ప్రాజెక్టు ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు రేవంత్ రెడ్డి. విచిత్రం ఏమిటంటే పదేళ్లు మోసం చేసిన వాళ్లే 10 నెలల్లో ఏం చేశారని అడుగుతున్నారని మండిపడ్డారు.. 11 ఏళ్లలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనల్లో ఏమేం చేశామో చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు కల్వకుంట్ల కుటుంబానికి.
రూ.1,030 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించుకున్నామని అన్నారు..ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గత పదేళ్లలో ప్రాజెక్టులు పూర్తి చేయ లేదన్నారు.. పదేళ్లుగా ఏం చేయకపోగా, తమ మా పాలనపై విష ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి.
గత ప్రభుత్వం వరికి గిట్టుబాటు ధర ఇచ్చి ఉంటే తెలంగాణ సస్య శ్యామలమై ఉండేదన్నారు. ఏడాదిలోనే 55 వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు.. ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ అని చెప్పారు.