DEVOTIONAL

తిరుమ‌లలో రీల్స్ చేస్తే చ‌ర్య‌లు – ఈవో

Share it with your family & friends

కేసులు న‌మోదు చేస్తామ‌ని వార్నింగ్

తిరుమ‌ల – టీటీడీ ఈవో జె. శ్యామ‌ల రావు సీరియ‌స్ అయ్యారు. ప‌విత్ర పుణ్య క్షేత్ర‌మైన తిరుమ‌ల‌లో ఎవ‌రైనా రీల్స్ చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తే చ‌ర్య‌లు తప్ప‌వ‌ని హెచ్చరించారు. ప్ర‌తి నిత్యం వేలాది మంది శ్రీ‌వారి, అమ్మ వారిని ద‌ర్శించు కునేందుకు వ‌స్తుంటార‌ని తెలిపారు. అయితే కొంద‌రు ప‌విత్ర‌త‌కు భంగం క‌లిగించేలా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని, ఇది త‌మ దృష్టికి వ‌చ్చింద‌ని స్ప‌ష్టం చేశారు. ఈ మేర‌కు ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

తిరుమలలో భక్తులను ఇబ్బందులు పెడితే క‌ఠిన‌ చర్యలు తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు. ఇప్ప‌టికే టీటీడీ పాల‌క‌వ‌ర్గం తిరుమ‌ల కొండ‌పై ఎలాంటి రాజ‌కీయ కామెంట్స్ చేయ‌రాద‌ని తీర్మానం చేయ‌డం జ‌రిగింద‌ని చెప్పారు జె. శ్యామ‌ల రావు.

పాపుల‌ర్ కావాల‌ని కొంద‌రు రీల్స్ చేస్తుండ‌డం బాధాక‌ర‌మ‌ని అన్నారు. ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ద‌తి కాద‌ని పేర్కొన్నారు. సీసీ కెమెరాల ద్వారా అన్నీ బ‌య‌ట ప‌డ‌తాయ‌ని, గ‌తంలో రీల్స్ కోసం ప్ర‌య‌త్నం చేసిన వారిపై కూడా సీసీ ఫుటేజ్ సాయంతో చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు జె. శ్యామ‌ల రావు.

తిరుమల ఘాట్ రోడ్డులో భక్తులను ఇబ్బందులు పెట్టిన వాహనాన్ని సీజ్ చేశామ‌న్నారు… అందరిపై కేసులు నమోదు చేశామ‌ని చెప్పారు.