NEWSANDHRA PRADESH

విప‌త్తుల నిర్వ‌హ‌ణ‌పై ఫోక‌స్ పెట్టాలి

Share it with your family & friends

మంత్రి వంగ‌ల‌పూడి అనిత

అమ‌రావ‌తి – విప‌త్తుల నిర్వ‌హ‌ణ‌పై జిల్లాల క‌లెక్ట‌ర్లు ఫోక‌స్ పెట్టాల‌ని స్ప‌ష్టం చేశారు ఏపీ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. సెక్రటరీయేట్ లో విపత్తునిర్వహణ శాఖపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ప్రభుత్వ శాఖ హెచ్ఓడీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం చేప‌ట్టారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 219 మల్టీపర్పస్ సైక్లోన్ సెంటర్లలో వసతుల ఏర్పాటుకు ప్రాధాన్యతనిస్తూ క‌లెక్ట‌ర్లు త‌ప్ప‌నిస‌రిగా ప‌ర్య‌వేక్షించాల్సిందిగా ఆదేశించారు వంగ‌ల‌పూడి అనిత‌. పర్యాటక ప్రాంతాలు, తుపాను షెల్టర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లలో ఉన్న ముందస్తు హెచ్చరికలను పంపే వ్యవస్థ( ఈడబ్ల్యూడీఎస్) సైరన్ అలారమ్ సిస్టం పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామ‌న్నారు.

విపత్తు సమయాల్లో ప్రాణ, ఆస్తి నష్ట నివారణ చర్యలతో పాటు సహాయక చర్యలు చేపట్టేందుకు అవసరమైన అత్యాధునిక శిక్షణ వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించడం జరిగిందన్నారు. విధ్వంసం సృష్టించే వాయుగుండం సమయంలో అంచనా కోసం అవసరమైన పరికరాల మరమ్మతులు సహా కొత్త టెక్నాలజీ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుని విపత్తు నిర్వహణ శాఖను పటిష్టంగా మారుస్తామ‌న్నారు.