DEVOTIONAL

ర‌థోత్స‌వంపై సిరుల‌త‌ల్లి

Share it with your family & friends

ర‌థాన్ని లాగిన భ‌క్తులు

శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ వారి బ్రహ్మోత్స‌వాలు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. ర‌థోత్స‌వం క‌న్నుల పండువ‌గా జ‌రిగింది. సిరుల‌త‌ల్లి ఆల‌య నాలుగు మాడ వీధుల్లో ఊరేగారు. భ‌క్తులు పెద్ద సంఖ్య‌లో పాల్గొన్నారు. ర‌థాన్ని లాగేందుకు పోటీ ప‌డ్డారు. శుక్ర‌వారం పంచ‌మి తీర్థం జ‌ర‌గ‌నుంది. టీటీడీ ఆధ్వ‌ర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది.

ఇదిలా ఉండ‌గా ఉదయం 8 గంటలకు ర‌థోత్స‌వం మొద‌లై ఆలయ నాలుగు మాడ వీధుల్లో సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో రథాన్ని లాగారు. సర్వాలంకార శోభితమైన రథంలో ప్రకాశించే అలమేలు మంగ సకలదేవతా పరివారంతో వైభవోపేతంగా తిరువీధులలో విహరించే వేళలో ఆ తల్లిని సేవించిన భక్తుల కోరికలు సిద్ధిస్తాయని విశ్వాసం.

రథోత్సవం ఉత్సవం మాత్రమే కాదు. భక్తుల హృదయ క్షేత్రాలలో తాత్త్వికబీ జాలు విత్తే ఒక యజ్ఞం. సింగారించిన పాలకడలి గారాల పట్టిని దర్శించిన వారికి జన్మాది దుఃఖాలు నశించి, మోక్షం లభిస్తుంది.

రథోత్సవం అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుండి రథ మండపంలో అమ్మ వారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, పన్నీరు, వివిధ రకాల ఫలాలతో అభిషేకం చేస్తారు. అనంతరం అమ్మ వారికి విశేషంగా అలంకారం చేస్తారు.

రాత్రి 7 నుండి 9 గంటల వరకు అశ్వ వాహనంపై అమ్మ వారు దర్శనం ఇవ్వనున్నారు.

ర‌థోత్స‌వంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ‌ర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ‌ర్‌స్వామి, ఈవో జె.శ్యామలరావు, జేఈవో వీర బ్రహ్మం, ఎఫ్ ఏ అండ్ సిఏఓ బాలాజీ, సిఈ సత్యనారాయణ, ఆలయ డెప్యూటీ ఈవో గోవింద రాజన్, ఆలయ అర్చకులు బాబు స్వామి, ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.