NEWSANDHRA PRADESH

జ‌గ‌న్ ముడుపుల‌పై విచార‌ణ చేప‌ట్టాలి

Share it with your family & friends

ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి

అమ‌రావ‌తి – మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డి రూ. 1750 కోట్ల ముడుపుల‌పై ఏసీబీ ద‌ర్యాప్తు చేప‌ట్టాల‌ని డిమాండ్ చేశారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి . ఆనాడు అదానీ డీల్ పై కోర్టును ఆశ్ర‌యించిన టీడీపీ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉందంటూ ప్ర‌శ్నించారు. చంద్ర‌బాబు నాయుడు వెంట‌నే విచార‌ణ‌కు ఆదేశించాల‌ని అన్నారు. ప్ర‌భుత్వ ఆధీనంలో ఏసీబీ ఉందంటూ ఆరోపించారు.

గురువారం ఏసీబీ కార్యాల‌యం వ‌ద్ద పంజ‌రంతో వినూత్నంగా ష‌ర్మిలా రెడ్డి మీడియాతో మాట్లాడారు. పంజ‌రం నుండి విడుద‌ల చేయాల‌ని అన్నారు. ఆనాడు ఏపీ రెవిన్యూ శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ ఆనాడు కేసు వేశార‌ని, ఇప్పుడు కీల‌క ప‌ద‌విలో ఉన్నా ఎందుకు కామ్ గా ఉన్నారో చెప్పాల‌న్నారు.

అదానీ పై అమెరికాలో దర్యాప్తు జరుగుతోంద‌న్నారు. సోలార్ పవర్ డీల్ లో జగన్ కి 1750 కోట్లు ముడుపులు ఇచ్చారని వెల్లడి అయ్యిందన్నారు. ఈ విషయాన్ని అమెరికా ఎఫ్బీఐ వెల్లడించింద‌న్నారు. ఇందుకు సంబంధించి ఆధారాలు కూడా బయ‌ట పెట్టింద‌న్నారు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి.

అదానీ తో 25 ఏళ్ల ఒప్పందం అంటే రాష్ట్రం నెత్తిన అధికార భారం పడుతుందన్నారు. సోలార్ ప‌వ‌ర్ రేట్లు త‌గ్గుతుంటే ఇంకో వైపు ఎలా ఒప్పందం చేసుకున్నారో చెప్పాల్సిన బాధ్య‌త మీపై లేదా అని ప్ర‌శ్నించారు. అస‌లు చంద్ర‌బాబు నాయుడు ఎందుకు అదానీ గురించి పేరు ఎత్త‌డం లేదంటూ మండిప‌డ్డారు.