కవిత కామెంట్స్ సురేఖ్ సీరియస్
ఏ హోదాలో నీ అల్లుడు వెళ్లాడు
హైదరాబాద్ – ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై నిప్పులు చెరిగారు మంత్రి కొండా సురేఖ. శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. సోయి తప్పి మాట్లాడటం మానుకోవాలని సూచించారు. భద్రాత్రి సీతా రామ స్వాములకు కేసీఆర్ మనవడు ఏ హోదాలో పట్టు వస్త్రాలను తీసుకు వెళ్లాడని ప్రశ్నించారు.
ఏ హోదాలో అక్కడికి వెళ్లాడు. సెక్యూరిటీ ఎవరు కల్పించారు. ఆ డబ్బులన్నీ ఎవరివని నిలదీశారు. ప్రజల సొమ్ము దోచుకు తిన్న మీకు మాట్లాడే అర్హత లేదన్నారు. లిక్కర్ స్కాంలో ఇరికిన నీకు అంత సీన్ లేదంటూ నిప్పులు చెరిగారు. లిక్కర్ రాణిగా పేరు పొందిన నీకు చిప్ప కూడే గతి అని హెచ్చరించారు.
బీజేపీ కాళ్లు మొక్కి తప్పించు కోలేదా అని, అది మరిచి పోతే ఎలా అని అన్నారు. కవిత ఎక్కడి నుంచి పోటీ చేసినా ఓటమి పాలు కావడం ఖాయమని జోష్యం చెప్పారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా కవిత మాటలు ఉన్నాయని పేర్కొన్నారు.
తాము తెలంగాణ ప్రజలకు జవాబుదారీగా ఉంటామని కానీ బీఆర్ఎస్ నేతలకు కాదన్నారు కొండా సురేఖ. పూలే గురించి మాట్లాడే హక్కు కవితకు లేదన్నారు. పదేళ్లు పాలించిన సమయంలో పూలే ఎందుకు గుర్తుకు రాలేదన్నారు.