NEWSANDHRA PRADESH

అంబేద్క‌ర్ స్పూర్తి ప్ర‌దాత – సీఎం

Share it with your family & friends

అంబేద్క‌ర్ వ‌ర్దంతి సంద‌ర్భంగా నివాళి

అమ‌రావ‌తి – అంబేద్క‌ర్ స్పూర్తి ప్రదాత అన్నారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. డిసెంబ‌ర్ 6 అంబేద్క‌ర్ వ‌ర్దంతి . ఈ సంద‌ర్బంగా ఆయ‌న చిత్ర ప‌టానికి పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పించారు.
ఈ దేశం గ‌ర్వించ‌ద‌గిన మాన‌వుడు డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేద్క‌ర్ అని అన్నారు.

ఇదిలా ఉండ‌గా అంబేద్క‌ర్ ఏప్రిల్, 14, 1891లో అణ‌గారిన పేద కుటుంబంలో పుట్టాడు. భార‌త రాజ్యాంగ నిర్మాత‌, రూప‌శిల్పి. ఆయ‌న బాబా సాహెబ్ గా పేరు పొందారు.

న్యాయనిపుణుడు, ఆర్థికవేత్త, రాజకీయవేత్త కూడా. అనేక సామాజిక ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చిన సంఘ సంస్కర్త. అంటరానివారిపై (దళితులపై) సామాజిక వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్వతంత్ర భారతదేశానికి మొదటి న్యాయ శాఖా మంత్రి.

కొలంబియా విశ్వ విద్యాలయం , లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ రెండింటి నుండి ఆర్థిక శాస్త్రంలో డాక్టరేట్లు పొందారు. 1990లో, భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న, మరణానంతరం అందించారు.

1930లో లండన్‌లో జరిగిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌లో అంబేద్క‌ర్ జోక్యం చేసుకున్నాడు, అక్కడ మహాత్మా గాంధీకి వ్యతిరేకంగా అంటరానివారికి పరిహార వివక్షను సమర్థించాడు.

సమానత్వానికి బలమైన మద్దతుదారుగా డాక్టర్ అంబేద్కర్ పుట్టుకతో నడిచే సామాజిక విభజన ఆలోచనను తిరస్కరించారు . ప్రజాస్వామ్య రాజకీయ సంస్థలకు కులం సామాజిక క్రమం విరుద్ధమని బలంగా భావించారు.