వైసీపీ నుంచి చంద్రబాబుకు ప్రాణహాని
ఆనం వెంకట రమణా రెడ్డి కామెంట్స్
అమరావతి – ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు ప్రాణ హాని ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ ఆక్వా కల్చర్ కార్పొరేషన్ చైర్మన్ ఆనం వెంకట రమణా రెడ్డి. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
గత ఐదేళ్ల వైసీపీ హయాంలో భారీ ఎత్తున అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారంపై చంద్రబాబు నాయుడు విచారణకు ఆదేశించారని, దీంతో తమ అవినీతి ఎక్కడ బయట పడుతుందోనని బెంబెలెత్తిన వైసీపీ నేతలు బాబును భౌతికంగా లేకుండా చేయాలని అనుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వారంతా కావాలని బాబుపై కక్ష కట్టారని ఆరోపించారు. కాకినాడ సెజ్ లో కేవీ రావు వాటాను ఎకరాకు రూ.29 వేల చొప్పున్న లాక్కోవడం వెనుక ఆంతర్యం ఏంటో చెప్పాలంటూ డిమాండ్ చేశారు ఆనం వెంకట రమణా రెడ్డి.
అధికారాన్ని అడ్డం పెట్టుకుని గత ప్రభుత్వంలో అందినంత మేర దండుకున్నారని, తాము పవర్ లోకి వచ్చాక అన్నింటిని , వాటి వెనుక బండారాన్ని బయట పెడుతున్నామని చెప్పారు. వైసీపీ నేతలు ఎవరినీ వదిలి పెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు చైర్మన్.