మహా కుంభ మేళాకు 40 కోట్ల మంది
యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య
అమరావతి – యూపీలో ఈసారి నిర్వహించే కుంభ మేళాకు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య. ఏపీలో ఆయన పర్యటించారు. ఈ సందర్బంగా పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి, కీలక నేతలు సాదర స్వాగతం పలికినందుకు ఆనందంగా ఉందన్నారు.
తాను తొలిసారి ఏపీకి వచ్చానని అన్నారు కేశ ప్రసాద్ మౌర్య. దుర్గామాతను దర్శించుకున్నానని, అత్యంత పవిత్రమైన, శక్తివంతమైన అమ్మ వారికి పూజలు చేయడం ఆనందంగా ఉందన్నారు. ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా అభివృద్ది పరుగులు పెడుతోందని చెప్పారు.
పోలింగ్ బూత్, శక్తి కేంద్రాల స్థాయిలో బిజెపి జాతీయ స్థాయిలో బలం గా ఉందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సబ్ కా సాత్ సబ్ కా వికాస్ నినాదంతో ముందుకు వెళుతున్నామన్నారు. మహా రాష్ట్ర లో మూడవ సారి అద్భుతమైన విజయాన్ని సాధించామన్నారు.
ప్రయాగ రాజ్ లో మూడు నదులు గంగ యమున సరస్వతి నదుల సంగమం అన్నారు. 2025 జనవరి లో మహా కుంభమేళ నిర్వహిస్తున్నామని , 40 కోట్ల మంది భక్తులు వస్తారని, వారికి తమ సర్కార్ అన్ని ఏర్పాట్లు చేస్తోందన్నారు.
కుంభమేళాకు రావాలని సీఎం చంద్రబాబు, గవర్నర్ ను ఆహ్వానించేందుకు తాను ఇక్కడికి వచ్చానని చెప్పారు డిప్యూటీ సీఎం. ఈ సమావేశంలో ప్రయాగ్ రాజ్ ఎమ్మెల్యే సిద్దార్థ్ నాథ్ సింగ్ , జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరాం , 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్, రాష్ట్ర మీడియా ఇంఛార్జి పాతూరి నాగభూషణం,సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ పాల్గొన్నారు