NEWSANDHRA PRADESH

ప్రైవేట్ స్కూల్స్ కు ధీటుగా ప్ర‌భుత్వ బ‌డులు

Share it with your family & friends

సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు
అమ‌రావ‌తి – ప్రైవేటు స్కూల్స్ కి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలని తయారు చేస్తామ‌న్నారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. శ‌నివారం బాప‌ట్ల‌లో జ‌రిగిన పేరెంట్స్ క‌మిటీ మీటింగ్ లో పాల్గొన్నారు. పిల్ల‌ల‌తో క‌లిసి భోజ‌నం చేశారు. విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఉన్నారు.

పిల్ల‌ల‌ను ప్రయోజకులని చేసే బాధ్యత త‌మ ప్ర‌భుత్వానిద‌ని స్ప‌ష్టం చేశారు సీఎం. టెక్నాల‌జీని వాడుకోవాల‌ని అవ‌కాశాల‌ను అందిపుచ్చు కోవాల‌ని పిలుపునిచ్చారు. మ‌న ముందున్న సాంకేతిక‌త అద్బుత‌మ‌న్నారు. దీనిని స‌రిగా వాడుకుంటే మ‌రింత ముందుకు వెళ్ల వ‌చ్చ‌న్నారు.

విద్యార్థులు కొత్త విష‌యాల‌ను నేర్చుకునేందుకు ప్ర‌య‌త్నం చేయాల‌ని సూచించారు నారా చంద్ర‌బాబు నాయుడు. మన సంస్కృతిలో తల్లి, తండ్రి, గురువుకి అధిక ప్రాధాన్యత ఉందన్నారు సీఎం. అలాంటి తల్లి, తండ్రి, గురువుని అందరినీ కలిపి, ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టడం చాలా సంతోషాన్ని ఇస్తుందన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 44 వేల ప్రభుత్వ పాఠశాలల్లో ఒకేసారి మెగా పేరెంట్ టీచర్ మీటింగులు జరుగుతున్నాయని చెప్పారు. ఇందులో కోటి 20 లక్షల మంది పాల్గొంటున్నారని తెలిపారు.. ఈ మెగా పేరెంట్ టీచర్ మీట్ తో ఆంధ్రప్రదేశ్ ఒక చరిత్ర సృష్టించిందన్నారు.