NEWSANDHRA PRADESH

ఏపీకి 8 కేంద్రీయ విద్యాల‌యాలు

Share it with your family & friends

మంత్రి నారా లోకేష్ వెల్ల‌డి

అమ‌రావతి – మోడీ కేంద్ర ప్ర‌భుత్వం ఖుష్ క‌బ‌ర్ చెప్పింది. త‌మ రాష్ట్రానికి ఎనిమిది కేంద్రీయ విద్యాల‌యాలు మంజూరు చేసింద‌ని వెల్ల‌డించారు ఏపీ విద్య‌, ఐటీ, క‌మ్యూనికేష‌న్స్ శాఖ మంత్రి నారా లోకేష్ .

ఈ మ‌ధ్య‌నే తిరుప‌తికి ఒక ఐఐటీని మంజూరు చేయ‌డం జ‌రిగింద‌ని తెలిపారు. దీంతో మొత్తం 9 కేంద్రీయ విద్యాలయాలను సాధించిందని స్ప‌ష్టం చేశారు మంత్రి. ఇప్పుడు ప్రకటించిన 8 కేంద్రీయ విద్యాలయాలు అనకాపల్లి, చిత్తూరులోని వలసపల్లె, శ్రీ సత్యసాయి జిల్లాలోని పాలసముద్రం, ఉమ్మడి గుంటూరు జిల్లాలోని తాళ్లపల్లె, రొంపిచర్ల, ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నందిగామ, నూజివీడు, నంద్యాల జిల్లాలోని డోన్‌లో రానున్నాయ‌ని స్ప‌ష్టం చేశారు నారా లోకేష్.

నాణ్యమైన విద్యా ప్రమాణాలకు పేరొందిన కేంద్రీయ విద్యాలయాలు ప్రస్తుతం ఏపీలో 35 ఉన్నాయని తెలిపారు. . వీటిల్లో 6594 మంది ఎస్సీ, 1476 మంది ఎస్టీ, 96 మంది దివ్యాంగ విద్యార్థులు చదువుకుంటున్నారని పేర్కొన్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన 9తో కలిపితే మొత్తం ఏపీలో 44 కేంద్రీయ విద్యాలయాలు ఉంటాయ‌ని చెప్పారు.