అది కాంగ్రెస్ తల్లి విగ్రహం
బీఆర్ఎస్ నేత జగదీశ్వర్ రెడ్డి
హైదరాబాద్ – మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై స్పందించారు. ఈనెల 9న సచివాలయంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ మాజీ సీఎం కేసీఆర్ కు ఆహ్వానం అందజేశారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఇచ్చారు.
ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు జగదీశ్వర్ రెడ్డి. తెలంగాణ తల్లి విగ్రహం పెడతాం అంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు . అది మన తల్లి విగ్రహం కానే కాదని, అది కాంగ్రెస్ పార్టీకి చెందిన తల్లి విగ్రహం అంటూ ఎద్దేవా చేశారు మాజీ మంత్రి.
కావాలంటే వాళ్ళ పార్టీ ఆఫీస్ లో పెట్టుకోమనండి, తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. గతంలో ఉన్న భరత మాత విగ్రహం తెలుగు తల్లి విగ్రహాలు ఇట్లనే ప్రభుత్వాలు మారగానే మార్చినరా? అని ప్రశ్నించారు. బహుషా రేవంత్ కి సలహా దారులుగా ఉన్న ఆంధ్ర పత్రిక సూచనలు తీసుకొని ఈ విగ్రహాన్ని చేపిచ్చినట్టుగా ఉందంటూ మండిపడ్డారు.