అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా
వెల్లడించిన కమిషనర్ ఏవీ రంగనాథ్
హైదరాబాద్ – హైడ్రా మరోసారి జూలు విదిల్చింది. శనివారం కూల్చివేతలు ప్రారంభించింది. ఆక్రమణలపై ఫోకస్ పెట్టింది. యాప్రాల్ లో అక్రమ నిర్మాణాలను గుర్తించింది. వాటికి అడ్డుకట్ట వేసింది.
మేడ్చల్ జిల్లా జవహర్ నగర్‌లోని యాప్రాల్‌లో హైడ్రా అక్రమ నిర్మాణాల కూల్చివేతలు చేపట్టింది. నాగిరెడ్డి కుంట నాలా బఫర్ జోన్ లో ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు నిర్ధారించింది హైడ్రా.
సర్వే నంబర్ 14, 32 ప్రభుత్వ భూమిలో డీఎన్‌ఆర్ ఫంక్షన్ హాల్ నిర్మాణం, కోర్టు స్టే ద్వారా తప్పుదారి పట్టించినట్లు తేల్చింది. జీహెచ్ఎంసీ చట్టం 405 ప్రకారం బఫర్ జోన్ లో నిర్మాణాలు చేపడితే తప్పకుండా కూల్చడమో లేదా చర్యలు తీసుకోవడం జరుగతుందని తేల్చారు కమిషనర్ ఏవీ రంగనాథ్.
దోభీఘాట్ ఆక్రమణ గుర్తింపు, కాంపౌండ్ వాల్ కూల్చివేత, ఆక్రమణలకు అడ్డుకట్ట వేసింది. హైడ్రా చర్యలతో ప్రభుత్వ భూముల పరిరక్షణ కమిటీ ఆనందం వ్యక్తం చేయగా, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
ఎవరైనా , ఏ పార్టీకి చెందిన వారైనా, ఎంతటి స్థాయిలో ఉన్నా ఆక్రమణలకు పాల్పడితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు మరోసారి కమిషనర్ రంగనాథ్.