సిరియా అధ్యక్షుడు బషర్ పరార్
దేశంలో వెల్లువెత్తిన సంబురాలు
సిరియా – సిరియాలో గత కొంత కాలంగా కొనసాగుతూ వస్తున్న అంతర్యుద్దం ముగిసింది. ఇంత కాలం రాచరిక పాలన సాగిస్తూ వచ్చిన సిరియా అధ్యక్షుడు బషర్ అస్సాద్ పారి పోయాడు. రాజకీయ ఖైదీలు విడుదలయ్యారు. తిరుగుబాటుదారుల కంటే ప్రెసిడెంట్ కనిపించకుండా పోయాడు.
విదేశాలలో ఉన్న తమ దేశ పౌరులంతా తిరిగి రావాలని పిలుపునిచ్చారు తిరుగుబాటుదారులు. నిరంకుశ, రాచరిక పాలనకు పుల్ స్టాప్ పడిందని పేర్కొన్నారు. దీనిపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా ప్రెసిడెంట్ బషర్ అస్సాద్ రష్యాలో తలదాచు కునేందుకు వెళ్లినట్లు టాక్.
యుద్ధంతో అతలాకుతలమైన సిరియాలోని ప్రతిపక్ష బలగాలు ఆదివారం తెల్లవారుజామున రాజధాని నగరం డమాస్కస్‌ను స్వాధీనం చేసుకున్నాయి.సైన్యం మోహరింపుల సంకేతాలు లేకుండా రాజధాని డమాస్కస్‌లోకి ప్రవేశించడం ప్రారంభించినట్లు సిరియా ప్రతిపక్షం తెలిపింది. 2011లో సిరియా అంతర్యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఈ పరిణామాలు అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్ పాలనకు అతిపెద్ద సవాలుగా మారాయి.
బీరుట్‌ను డమాస్కస్‌తో కలిపేది మినహా సిరియాతో ఉన్న అన్ని భూ సరిహద్దు క్రాసింగ్లను మూసి వేస్తున్నట్లు లెబనాన్ తెలిపింది. జోర్డాన్ సిరియాతో సరిహద్దు క్రాసింగ్‌ను కూడా మూసివేసింది.