NEWSANDHRA PRADESH

విజ‌యసాయి రెడ్డిపై సీపీకి ఫిర్యాదు

Share it with your family & friends

అరెస్ట్ చేయాల‌ని వెంక‌న్న డిమాండ్

అమ‌రావ‌తి – వైసీపీ ఎంపీ విజ‌య సాయి రెడ్డిపై నిప్పులు చెరిగారు టీడీపీ సీనియ‌ర్ నేత బుద్దా వెంక‌న్న‌. ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్ర‌బాబు నాయుడుపై వైసీపీ ఎంపీ అనుచిత వ్యాఖ్య‌లు చేశారంటూ ఆరోపించారు. ఈ మేర‌కు విజ‌య‌వాడ న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ ను క‌లిశారు. ఎంపీపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ ఫిర్యాదు చేశారు.

అనంత‌రం బుద్దా వెంక‌న్న మీడియాతో మాట్లాడారు. త‌మ పార్టీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు నాయుడుకు సంబంధించి వ్య‌క్తిగ‌త ప్ర‌తిష్ట‌కు భంగం క‌లిగించేలా ఎంపీ కామెంట్స్ చేయ‌డం దారుణ‌మ‌ని పేర్కొన్నారు. వెంట‌నే విజ‌య సాయి రెడ్డిని అరెస్ట్ చేయాల‌ని వెంక‌న్న డిమాండ్ చేశారు.

ముందు నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడాల‌ని వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు బతికి ఉంటే.. మేము అధికారంలోకి వస్తే జైల్లో వేస్తాం అంటావా అంటూ మండిప‌డ్డారు. నువ్వు బెదిరించి, బ్లాక్ మెయిల్ చేస్తే.. భయపడి పోతామ‌ని అనుకుంటే ఎలా అని ప్ర‌శ్నించారు.

కాకినాడ పోర్టును జగన్ బలవంతంగా లాక్కున్నారనేది వాస్తవం కాదా అని ప్ర‌శ్నించారు బుద్దా వెంక‌న్న‌. ఆదాయం వచ్చే ఆస్తులు ఎవరు అమ్మరని, కేవీ రావు దగ్గర మీరు ఎలా తీసుకున్నారో చెప్పగలరా అని స‌వాల్ విసిరారు .

2019 నుంచి 2024 వైసీపీ నాయకులు చేసిన దాడులు, దారుణాలు అన్నీ ఇన్నీ కావన్నారు. ఎంతోమంది బాధితులు ఇప్పుడు పోలీసులకు, కలెక్టర్లకు ఫిర్యాదులు చేస్తున్నారని చెప్పారు. చంద్రబాబుకు వార్నింగ్ ఇచ్చే స్థాయిలో మాట్లాడతావా.. ప్రజలు చెప్పులతో కొడతారు జాగ్ర‌త్త అంటూ హెచ్చ‌రించారు.