NEWSTELANGANA

ఇంపాక్ట్ స‌మ్మిట్ కు ఛేంజ్ మేక‌ర్స్

Share it with your family & friends

అభినందించిన మంత్రి శ్రీ‌ధ‌ర్ బాబు

హైద‌రాబాద్ -న్యూయార్క్ లోని యుఎన్ ప్ర‌ధాన కార్యాల‌యంలో జ‌రిగే 8వ యాక్టివేట్ ఇంపాక్ట్ సమ్మిట్ లో తెలంగాణ త‌ర‌పున ప్రాతినిధ్యం వ‌హించ‌నున్నారు యంగ్ ఛేంజ్ మేక‌ర్స్. ఈ సంద‌ర్బంగా వారిని ప్ర‌త్యేకంగా అభినందించారు మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ బాబు. తెలంగాణ‌కు గ‌ర్వ కార‌ణంగా నిల‌వాల‌ని సూచించారు. టాప్ 4ని జ‌రుపుకోవ‌డం ఆనందంగా ఉంద‌న్నారు.

10 మిలియ‌న్ల జ‌నాభాతో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న న‌గ‌రంగా హైద‌రాబాద్ ఘ‌న‌త వ‌హించింద‌న్నారు. అన్ని రంగాల‌లో అగ్ర‌గామిగా ఉంద‌ని పేర్కొన్నారు శ్రీ‌ధ‌ర్ బాబు. తరువాతి దశాబ్దాలలో జనాభా రెట్టింపు అవుతున్నందున, స్థిరమైన అభివృద్ధి దాని పెరుగుదలకు ప్రధాన అంశంగా ఉండాలని స్ప‌ష్టం చేశారు మంత్రి.

ఐఎంఐబీ గ్రీన్ స్కిల్స్ అకాడమీని రూపొందించేందుకు తెలంగాణ స‌ర్కార్ భాగస్వామ్యం కుదుర్చుకుంద‌ని తెలిపారు. 17 మంది విద్యార్థుల‌తో టాప్ 13 గ్రీన్ టెక్నాల‌జీల‌కు సంబంధించి వ‌ర్కింగ్ ప్రోటో టైప్ ల‌ను రూపొందించ‌డం జ‌రిగింద‌న్నారు.

ప్ర‌పంచంలోనే అతి పెద్ద టెక్నాల‌జీ ఇంక్యుబేట‌ర్ అయిన టి-హ‌బ్ లో టాప్ 10 ఇన్నోవేట‌ర్స్ ఈ అవ‌కాశాన్ని పొందార‌ని తెలిపారు దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ బాబు.