రోహిత్ శర్మను తొలగించండి
సునీల్ గవాస్కర్ డిమాండ్
హైదరాబాద్ – ప్రముఖ మాజీ క్రికెటర్ , కామెంటేటర్ సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆసిస్ తో జరిగిన 2వ టెస్టులో భారత జట్టు ఘోరంగా ఓటమి పాలైంది. దీంతో కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. సన్నీ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
5 టెస్టుల సీరీస్ లో భాగంగా తొలి టెస్టులో ఇండియా గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. ఇటు బౌలింగ్ అటు బ్యాటింగ్ లో సత్తా చాటింది. ప్రధానంగా స్టాండింగ్ కెప్టెన్ గా ఉన్న జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన బౌలింగ్ తో పాటు కెప్టెన్సీ కూడా బాగా చేశాడని పేరు పొందాడు.
ఈ తరుణంలో గాయం కారణంగా తొలి టెస్టు మ్యాచ్ కు దూరమైన రోహిత్ శర్మ రెండో టెస్టుకు ఆడాడు. కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. ఈ తరుణంలో ఉన్నట్టుండి టెస్టు ఓడి పోవడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో కొనసాగుతున్నాడు. తనను వెంటనే తొలగిస్తేనే బెటర్ అంటూ పెద్ద ఎత్తున కామెంట్స్ వస్తున్నాయి. దీనిపై కోచ్ గంభీర్ ఇంకా స్పందించ లేదు.