గులాబీ శ్రేణులకు కేసీఆర్ దిశా నిర్దేశం
అసెంబ్లీ అనుసరించాల్సిన వ్యూహంపై
సంగారెడ్డి జిల్లా – తెలంగాణ తొలి ముఖ్యమంత్రి , బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు గులాబీ శ్రేణులకు. ఆదివారం కీలకమైన సమావేశం జరిగింది. ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో జరిగిన బీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశం ముగిసింది.
కేసీఆర్ అధ్యక్షతన మూడున్నర గంటలపాటు సాగింది ఈ సమావేశం. పార్టీ ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు దిశానిర్ధేశం చేశారు కేసీఆర్.
ప్రజా పాలన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోందని, అడుగడుగునా ప్రజలు ఇబ్బందులకు లోనవుతున్నారని, ఈ తరుణంలో సర్కార్ వైఫల్యాలను ఎండగట్టాలని స్పష్టం చేశారు. ప్రజా ప్రతినిధులు పూర్తి సమాచారంతో వెళ్లాలని, ప్రభుత్వాన్ని, మంత్రులను ఇరుకున పెట్టే ప్రయత్నం చేయాలన్నారు.
అంతే కాదు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించాలని, ప్రధానంగా రైతు బంధు, రైతు భరోసా, ఇతర హామీల గురించి సర్కార్ ను నిలదీయాలని హిత బోధ చేశారు కేసీఆర్. ఎక్కడా ఊపిరి తీసుకోనీయకుండా చేయాలని స్పష్టం చేశారు.