DEVOTIONAL

పీఠాధిప‌తిని క‌లిసిన టీటీడీ చైర్మ‌న్

Share it with your family & friends

ఆశీర్వ‌దించిన కంచి కామ‌కోటి పీఠం

తిరుమ‌ల – తిరుమ‌ల‌లో కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ‌శ్రీ‌శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామీజీని మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. ఆదివారం సాయంత్రం తిరుమలలోని కంచి మఠంలో క‌లిశారు. ఈ సంద‌ర్భంగా స్వామీజీ చైర్మన్ ను ఆశీర్వ‌చ‌నం అందించారు.

ఈ సందర్భంగా స్వామీజీ చైర్మన్ తో మాట్లాడుతూ టీటీడీ నూతన ధర్మకర్తల మండలి ఇటీవల తీసుకున్న నిర్ణయాలను అభినందించారు. తిరుమల పవిత్రతను కాపాడే విధంగా , భక్తులకు మేలు చేకూరేలా నిర్ణయాలు తీసుకోవడం ప్రశంసనీయమని తెలిపారు.

తిరుమలను మరింత సుందర దివ్య క్షేత్రంగా తీర్చిదిద్దాలని, వేద విద్య వ్యాప్తికి కృషి చేయాలని చైర్మన్ కు సూచించారు. ఎంతో శ్ర‌మ‌కోర్చి తిరుమ‌ల పుణ్య క్షేత్రానికి విచ్చేసే భ‌క్తుల‌కు త్వ‌రిత‌గ‌తిన శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకునేలా కృషి చేయాల‌ని స్ప‌ష్టం చేశారు కంచి కామ‌కోటి పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ విజ‌యేంద్ర స‌ర‌స్వ‌తి స్వామీజీ.