కుంభమేళాకు 3 వేల ప్రత్యేక రైళ్లు
ప్రకటించిన కేంద్ర మంత్రి వైష్ణవ్
హైదరాబాద్ – కేంద్ర రైల్వే శాఖ సంచలన ప్రకటన చేసింది. వచ్చే జనవరిలో యూపీలో జరిగే మహా కుంభ మేళాకు 40 కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేసింది ప్రభుత్వం. ఈ మేరకు భక్తుల రవాణాకు సంబంధించి దేశ వ్యాప్తంగా 3 వేల రైళ్లను ప్రత్యేకంగా నడుపుతున్నట్లు వెల్లడించారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్.
కుంభ మేళాను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇది గొప్ప ఆధ్యాత్మిక పండుగగా భావిస్తారు . హిందూ సంప్రదాయాలు, ఆచారాలలో లోతుగా పాతుకుపోయిన ఈ అసాధారణ సంఘటన భారతదేశంలో విశ్వాసం, ఆధ్యాత్మికత శాశ్వత ప్రాముఖ్యతకు నిదర్శనం.
మహా కుంభమేళా కేవలం మతపరమైన కార్యక్రమం మాత్రమే కాదు, శతాబ్దాలుగా జరుపుకుంటున్న ఒక సాంస్కృతిక దృగ్విషయం. భక్తులు, సాధువులు, ఋషులు కలిసి పుణ్య నదులలో స్నానమాచరించే సమయం ఇది,
ఈ చర్య తమ పాపాలను పోగొట్టి మోక్షానికి చేరువ చేస్తుందని నమ్ముతారు. కుంభమేళా భారతదేశంలోని నాలుగు వేర్వేరు ప్రదేశాలలో ప్రతి పన్నెండు సంవత్సరాలకు జరుగుతుంది. ప్రయాగ్‌రాజ్ (అలహాబాద్), హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్.
ఈ కుంభ మేళా ప్రయాగ్ రాజ్ లో నిర్వహించనున్నారు. ఇది మూడు పవిత్ర నదుల సంగమం. గంగా, యమునా, పౌరాణిక సరస్వతి. జనవరి 13న ప్రారంభమై ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతుంది. ఇప్పటికే ఏర్పాట్లలో నిమగ్నమై ఉంది యోగి సర్కార్.