విశ్వ శాంతి యాగంలో ఈవో
జనవరి 1 వరకు కొనసాగుతుంది
ఉత్తర ప్రదేశ్ – యూపీలోని అయోధ్యలో శ్రీ మహా నారాయణ దివ్య రుద్ర సహిత శత సహస్ర చండీ విశ్వ శాంతి మహా యాగం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు టీటీడీ ఈవో జె. శ్యామల రావు దంపతులు. ప్రపంచ శాంతి కోసం ఈ యాగాన్ని చేపట్టారు.
ఇదిలా ఉండగా ప్రపంచ శాంతి కోసం ఉత్తర ప్రదేశ్ యోగి సర్కార్ దీనిని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. అయోధ్యలో శ్రీ రామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ నిర్వహిస్తోంది శ్రీ మహా నారాయణ దివ్య రుద్ర సహిత శత సహస్ర చండీ విశ్వ శాంతి మహా యాగం.
ఈ యాగం గత నవంబర్ 18 నుండి ప్రారంభమైంది. 45 రోజుల పాటు కొనసాగుతంది. వచ్చే ఏడాది జనవరి 1వ తేది నాటికి పూర్తవుతుంది .
ఈ కార్యక్రమంలో ఈవో దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇదిలా ఉండగా మహా కుంభ మేళా జరగనుంది. ఇందుకు సంబంధించి కేంద్ర రైల్వే శాఖ సంచలన ప్రకటన చేసింది. 40 కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేసింది ప్రభుత్వం. 3 వేల ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
కుంభ మేళాను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇది గొప్ప ఆధ్యాత్మిక పండుగగా భావిస్తారు . హిందూ సంప్రదాయాలు, ఆచారాలలో లోతుగా పాతుకుపోయిన ఈ అసాధారణ సంఘటన భారతదేశంలో విశ్వాసం, ఆధ్యాత్మికత శాశ్వత ప్రాముఖ్యతకు నిదర్శనం.