NEWSTELANGANA

కిష‌న్ రెడ్డి నిధులెన్ని తెచ్చావో చెప్పు

Share it with your family & friends

నిప్పులు చెరిగిన మాజీ ఎంపీ యాష్కి

హైద‌రాబాద్ – కేంద్ర మంత్రి జి. కిష‌న్ రెడ్డిని ఏకి పారేశారు టీపీసీసీ ప్ర‌చార క‌మిటీ చైర్మ‌న్ మ‌ధు యాష్కి గౌడ్. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కేంద్ర మంత్రిగా ఆరేళ్ల నుంచి తెలంగాణ‌కు ఎన్ని నిధులు తీసుకు వ‌చ్చావో చెప్పాల‌ని కిష‌న్ రెడ్డిని నిల‌దీశారు

క‌నీసం అంబర్ పేట నియోజ‌క‌వ‌ర్గాన్నైనా బాగు చేసేందుకు ప్ర‌య‌త్నం చేశావా అని ప్ర‌శ్నించారు. సాక్స్ వేసుకుని కూలర్లు పెట్టుకుని పడుకున్నంత మాత్రాన మూసీ మురికి కంపు పోదంటూ ఎద్దేవా చేశారు. ప్ర‌చారం త‌ప్పా చేసింది ఏమీ లేద‌ని మండిప‌డ్డారు మ‌ధు యాష్కి గౌడ్.

ప్రపంచ నగరాలతో పోటీ పడేలా హైదరాబాద్ నగరాన్ని గ్లోబల్ సిటీగా ఎదగడంలో సీఎం రేవంత్ రెడ్డి పాత్ర ఎంతో ఉంద‌న్నారు. ముందు కేంద్ర స‌ర్కార్ రాష్ట్రానికి సంబంధించి ఎన్ని నిధులు ఇచ్చిందో శ్వేత ప‌త్రం విడుద‌ల చేయాల‌ని అన్నారు. ప్ర‌జ‌ల‌ను ఇంకా ఎంత కాలం న‌మ్మించేందుకు ప్ర‌య‌త్నం చేస్తారంటూ ధ్వ‌జ‌మెత్తారు. ఇక‌నైనా ప్ర‌జ‌ల్లోకి రావాల‌ని పిలుపునిచ్చారు.