NEWSTELANGANA

మ‌త విద్వేషాలు రెచ్చ‌గొడితే ఎలా..?

Share it with your family & friends

మంత్రి సీత‌క్క షాకింగ్ కామెంట్స్

హైద‌రాబాద్ – మంత్రి దాసరి సీత‌క్క నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ లౌకిక వాదాన్ని అమలు చేస్తుంటే.. కొందరు మత విద్వేషాలు రెచ్చ గొడుతున్నారంటూ మండిప‌డ్డారు . ఆమె మీడియాతో మాట్లాడారు. దేవుడు గుడి, చర్చి, మసీదు అన్ని చోట్ల ఉంటాడన్నారు.

ఎవరి నమ్మకం వారిది. కానీ దేవుడిని రోడ్ల మీద జెండాలపై.. రాజకీయ అజెండాలపై పెట్టవద్దన్నారు. తాము మంచి ప‌నుల‌తో ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళుతున్నామ‌న్నారు సీత‌క్క‌. దీనిని చూసి భార‌తీయ జ‌న‌తా పార్టీ త‌ట్టుకోలేక పోతోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు.

ప్ర‌తిప‌క్షాలు కావాల‌ని రాజ‌కీయం చేస్తున్నార‌ని తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. వ్య‌వ‌స్థ‌ల‌ను గ‌త 10 సంవ‌త్స‌రాల కాలంలో భ్ర‌ష్టు ప‌ట్టించార‌ని, వాటిని స్ట్రీమ్ లైన్ లోకి తీసుకు వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌ని అన్నారు సీత‌క్క‌.

అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు మేలు చేకూర్చేలా తమ ప్ర‌భుత్వం కృషి చేస్తోంద‌ని స్ప‌ష్టం చేశారు.