NEWSTELANGANA

అసెంబ్లీ వ‌ద్ద ఎమ్మెల్యేల అడ్డ‌గింత

Share it with your family & friends

అడ్డుకున్న పోలీసులపై ఆగ్ర‌హం

హైద‌రాబాద్ – అసెంబ్లీ వ‌ద్ద తీవ్ర ఉద్రిక్త‌త చోటు చేసుకుంది. సోమ‌వారం శాస‌న స‌భ స‌మావేశాలు ప్రారంభం అయ్యాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌ను అడ్డుకున్నారు భ‌ద్ర‌తా సిబ్బంది. ఈ సంద‌ర్బంగా ప్ర‌భుత్వానికి వ్య‌తిర‌కంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ స‌ర్కార్ ప్ర‌జా వ్య‌తిరేక పాల‌న సాగుతోంద‌ని ఆరోపించారు.

బీజేపీ, కాంగ్రెస్ ఒక్క‌టయ్యాయ‌ని మండిప‌డ్డారు కేటీఆర్. సీఎంకు బుద్ది చెప్ప‌డం ఖాయ‌మ‌న్నారు. ఇదిలా ఉండ‌గా కేటీఆర్‌, హరీశ్‌ రావు సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అదానీ, రేవంత్‌ రెడ్డి ఫొటోల‌తో కూడిన టీ షర్ట్స్ ను ధ‌రించారు.

వీటిపై తీవ్ర అభ్యంత‌రం తెలిపారు పోలీసులు. త‌మ‌ను అడ్డుకోవ‌డంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు కేటీఆర్. ఈ నేపథ్యంలో భద్రతా సిబ్బందికి, బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

రేవంత్ అదానీ భాయి భాయి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఢిల్లీలో కుస్తీ గ‌ల్లీలో దోస్తీ అంటూ ఫైర్ అయ్యారు. తెలంగాణ త‌ల్లి మీది కాంగ్రెస్ త‌ల్లి మీది అంటూ ఫైర్ అయ్యారు . అంత‌కు ముందు గ‌న్ పార్క్ వ‌ద్ద అమ‌రుల‌కు నివాళులు అర్పించారు.