చెన్నమనేనికి హైకోర్టు షాక్
పిటిషనర్ కు నష్ట పరిహారం
హైదరాబాద్ – భారత రాష్ట్ర సమితి మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది రాష్ట్ర హైకోర్టు. పిటిషనర్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టింది. ఈ సందర్బంగా జర్మనీకి చెందిన పౌరసత్వం కలిగి ఉంటూ ..తప్పుడు పత్రాలు స్పృష్టించడమే కాకుండా ఎమ్మెల్యేగా గెలుపొందడాన్ని తీవ్రంగా తప్పు పట్టింది. ఇలా చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది కోర్టు.
తప్పుడు పత్రాలు సమర్పించడాన్ని తీవ్రంగా పరిగణించింది. తప్పుడు పత్రాలు సృష్టించి గెలుపొందాడంటూ పిటిషనర్ ఆరోపించారు. ఆధారాలు లభ్యం కావడంతో కోర్టు సీరియస్ అయ్యింది. రూ. 30 లక్షల జరిమానా విధించింది. అంతే కాకుండా పిటిషనర్ కు నష్ట పరిహారం కింద రూ. 25 లక్షలు ఇవ్వాలని ఆదేశించింది.
వీటితో పాటు లీగల్ సర్వీసెస్ అథారిటీకి రూ. 5 లక్షలు ఇవ్వాలని స్పష్టం చేసింది హైకోర్టు. ఇదిలా ఉండగా కోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందించారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ఇన్నేళ్లుగా తాను చేసిన న్యాయ పోరాటానికి తనకు మద్దతు ఇచ్చినందుకు నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కోర్టును తప్పుదోవ పట్టించినందుకు చెన్నమనేని రమేష్ పై చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతానని చెప్పారు.