ప్రజల ప్రతిబింబమే తెలంగాణ తల్లి
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – నాలుగున్నర కోట్ల ప్రజల ప్రతిబింబమే తెలంగాణ తల్లి విగ్రహమని అన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. గత 10 ఏళ్ల కాలంలో ఒక కుటుంబం మాత్రమే బాగు పడుతోందని ఆరోపించారు. ఉద్యమకారుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా వాహనాలకు టీజీ బదులు టీఎస్ అని నిర్ణయించడం జరిగిందన్నారు సీఎం.
అందుకే ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తెలంగాణ అస్తిత్వానికి సంబంధించి టీఎస్ కు బదులుగా టీజీ అని అధికారికంగా ప్రకటించామని చెప్పారు ఎ. రేవంత్ రెడ్డి. ఉద్యమ సమయంలో స్ఫూర్తిని నింపిన జయ జయహే తెలంగాణ గీతాన్ని పదేళ్లుగా రాష్ట్ర గీతంగా ప్రకటించ లేదని మండిపడ్డారు.
ప్రజా ప్రభుత్వంలో ఆ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించుకున్నామని తెలిపారు సీఎం. ఉద్యమ కాలంలో తెలంగాణ తల్లికి వివిధ రూపాలు ఇచ్చారు. కానీ, అసలైన రూపం ఇవ్వలేదన్నారు . అందుకే బహుజనులకు సంబంధించి తల్లి రూపమే తెలంగాణ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఎ. రేవంత్ రెడ్డి. ప్రస్తుతం తెలంగాణ తల్లిని చూస్తే అచ్చం మనల్ని కన్న తల్లి జ్ఞాపకం వచ్చేలా తయారు చేయించామన్నారు.