శ్రవణం ప్రాజెక్టును పరిశీలించిన చైర్మన్
సమస్యలను పరిష్కరిస్తామని నాయుడు హామీ
తిరుమల – తిరుమలలోని టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రవణం ప్రాజెక్టును ఆకస్మికంగా తనిఖీ చేశారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. ఈ సందర్బంగా చిన్నారులతో ముచ్చటించారు. అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు.
పిల్లలకు సులువుగా జీర్ణమయ్యే ఆహారాన్ని అందించాలని జెఇఓ గౌతమిని ఆదేశింశాచరు టిటిడి చైర్మన్ .
పిల్లలకు అందించే పాలు, స్నాక్స్ ను 2019 సంవత్సరం నుంచి ఇవ్వడం లేదని బీఆర్ నాయుడు దృష్టికి తీసుకు వెళ్లారు పిల్లల పేరెంట్స్.
డేస్కాలర్స్ కు అల్పాహారం, భోజనం పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారుల తల్లులకు అందించే పౌష్టికాహారంలో నాణ్యత తప్పనిసరిగా ఉండేలా చూడాలని స్పష్టం చేశారు టీటీడీ చైర్మన్ . శ్రవణం ప్రాజెక్టులోని కొన్ని తరగతి గదులు శిథిలావస్థకు చేరుకోవడాన్ని పరిశీలించారు.
హియరింగ్ కిట్స్ ను టిటిడినే ఉచితంగా అందించాలని టిటిడి ఛైర్మన్ ను కోరారు చిన్నారుల తల్లులు. తన దృష్టికి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. నెల రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పారు.