NEWSTELANGANA

నాగార్జున‌సాగ‌ర్ ప్రాజెక్టుకు 70 ఏళ్లు

Share it with your family & friends

ప్ర‌పంచ ప్రాజెక్టు నిర్మాణాల్లో టాప్

డిసెంబ‌ర్ 10వ తేదీతో నాగార్జున‌సాగ‌ర్ ప్రాజెక్టుకు 70 ఏళ్లు పూర్త‌య్యాయి. ఏపీ అన్న‌పూర్ణ‌గా , రైతుల పాలిట క‌ల్ప‌తరువుగా విరాజిల్లుతోంది. కేఎల్ రావు, మ‌హేశ్వ‌ర్ ప్ర‌సాద్ దీనిని డిజైన్ చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం 1970లో పూర్త‌యింది. ప్ర‌పంచ రాతి నిర్మాణాల ప్రాజెక్టుల్లో కెల్లా సాగ‌ర్ టాప్ లో కొన‌సాగుతోంది.

ఈ ప్రాజెక్టుకు దేశ తొలి ప్ర‌ధాన‌మంత్రి పండిట్ జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ శంకుస్థాప‌న చేశారు. దీని నిర్మాణంలో వేలాది మంది కూలీలు పాల్గొన్నారు. మీర్ జాఫ‌ర్ అలీ చీఫ్ ఇంజ‌నీర్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఇది కొన‌సాగింది.

రాతి నిర్మాణ ప్రాజెక్టుల‌లో ప్ర‌పంచంలోనే పొడ‌వు, ఎత్తులో టాప్ లో కొన‌సాగుతోంది. దీనికి కుడి, ఎడ‌మ కాలువలు ఉన్నాయి. కుడి కాలువ‌కు అప్ప‌టి సీఎం నీలం 1956 అక్టోబ‌ర్ 10న శంకుస్థాప‌న చేశారు. ఈ కాలువ‌ను జాతికి అంకితం చేశారు ఇందిరాగాంధీ 1967లో.

ఈ కాలువ గుంటూరు, ప్రకాశం జిల్లా లో సుమారు 203కి.మీ. ప్రవహిస్తూ రైతన్నల ఆశాజ్యోతిగా వెలుగొందుతోంది. ఈ కాలువ కింద 11.74 లక్షల ఎకరాలకు నీరందుతోంది. ఈ కాలువ కింద ఆయకట్టును 22 బ్లాకులుగా విభజించారు. వీటికి 9 బ్రాంచ్‌ కెనాల్స్‌ కలిగి 5342 కి.మీ. పంటలకు నీటిని అందిస్తోంది. దీనికితోడు ఫీల్డ్‌చానల్స్‌ ద్వారా 14,400 కి.మీ. పంటలకు నీరు అందుతోంది.

సాగర్‌ ఎడమ కాలువకు లాలా బహుదూర్‌ కెనాల్‌ అని పేరు పెట్టారు. ఈ కాలువ ద్వారా 10.38 లక్షల ఎకరాలకు నీటిని అందిస్తోంది. మొత్తం 297కి.మీ. పరిధిలోని పొలాలకు సాగునీరు అందుతోంది.
జల విద్యుత్ ఉత్పత్తి చేసే కేంద్రంగా కూడా కొనసాగుతోంది.

ప్రపంచ పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది. ఈ ప్రాజెక్టు న‌ల్ల‌గొండ జిల్లా పెద్దపూర మండ‌లం నందికొండ వ‌ద్ద ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *