NEWSANDHRA PRADESH

ఏపీలో రూ.4,677 కోట్ల లిక్క‌ర్ సేల్స్

Share it with your family & friends

భారీ ఎత్తున స‌మ‌కూరిన ఆదాయం

అమ‌రావ‌తి – ఏపీ ప్ర‌భుత్వానికి మ‌ద్యం నుంచి భారీ ఎత్తున ఆదాయం స‌మ‌కూరింది. పెద్ద ఎత్తున సేల్స్ పెర‌గ‌డంతో చంద్ర‌బాబు నాయుడు కూట‌మి ఫుల్ జోష్ లో కొన‌సాగుతోంది. ఓ వైపు మ‌ద్యాన్ని నిషేధిస్తామంటూనే మ‌రో వైపు షాపుల‌కు బార్లా తెరించింది. పెద్ద ఎత్తున వేలం పాట చేప‌ట్టారు. ఓ వైపు తుపాను దెబ్బ‌కు ఏపీ అత‌లాకుత‌లం అయ్యింది.

తాజాగా ప్ర‌క‌టించిన స‌మాచారం మేర‌కు ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో ఈ ఏడాది అక్టోబర్ 16 నుంచి ఏపీలో 3,300 దుకాణాల్లో పెద్ద ఎత్తున మ‌ద్యం అమ్ముడు పోయింది. ఏకంగా రూ.4,677 కోట్ల మేర ఆదాయం వ‌చ్చింది. 61.63 లక్షల కేసుల మద్యం.. 19.33 లక్షల కేసుల బీర్ల అమ్ముడు పోయాయి. ఇది ఓ రికార్డ్ అని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఈ ఏడాది త్వ‌ర‌లోనే ముగుస్తుంది. ఈ త‌రుణంలో డిసెంబ‌ర్ 31న ఇయ‌ర్ ఎండ్ కావడంతో పెద్ద ఎత్తున సేల్స్ పెరిగే ఛాన్స్ ఉంద‌ని కూట‌మి స‌ర్కార్ భావిస్తోంది. దీంతో మ‌ద్యం త‌యారీ, డిస్ట్రిబ్యూట్ దారులు పెద్ద ఎత్తున స‌ర‌ఫ‌రా చేయాల‌ని ఆదేశించిన‌ట్లు స‌మాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *