NEWSANDHRA PRADESH

ఏపీ అడుగుజాడ ప‌ర్యాట‌కానికి పెద్ద‌పీట

Share it with your family & friends

స‌ర్కార్ నూత‌న ప‌ర్యాట‌క పాల‌సీ రిలీజ్

అమ‌రావ‌తి – ఏపీ స‌ర్కార్ నూత‌న ప‌ర్యాట‌క పాల‌సీని విడుద‌ల చేసింది. ప‌ర్యాట‌క రంగానికి పెద్ద‌పీట వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ప‌ర్యాట‌క రంగానికి ప‌రిశ్ర‌మ హోదా క‌ల్పించాల‌ని పేర్కొంది. రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధి, ఆర్థిక పురోభివృద్ధికి ప్రోత్సాహం, ఉద్యోగాల కల్పన, సాంస్కృతిక మార్పిడి సులభతరం చేసేలా పాలసీని రూపొందించారు.

రాష్ట్ర గ్రాస్ వ్యాల్యూ యాడెడ్ (జీవీఏ)లో పర్యాటక రంగం వాటా 4.6 శాతం నుండి 8 శాతానికి పెంచడం..20 శాతం పైబడి జివిఎను కంట్రిబ్యూట్ చేయాలన్నది ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. ఉపాధి అవకాశాలను 12 శాతం నుండి 15 శాతానికి పెంపొందించడం, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించడం, విదేశీ పర్యాటకుల రాకలో టాప్ 10 రాష్ట్రాల్లో ఒకటిగా ఏపీని చేర్చ‌డం. ప‌ర్యాట‌కుడు పెట్టే ఖ‌ర్చు రూ. 1700 నుండి రూ. 25,000ల‌కు పెంచేలా చేయ‌డం. ప‌ర్యాట‌కులు 5 రోజులు ఉండేలా చూడ‌డ‌డం.

రాష్ట్రంలో పర్యాటకులకు వసతి సామర్థ్యం పెంచే ప్రక్రియలో భాగంగా హోటళ్లలో గదుల సంఖ్యను 3,500 నుండి 10,000కు పెంచడం , పబ్లిక్ ప్రైవేట్ పార్ట్ నర్ షిప్ విధానంలో ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడం, స్థానిక పర్యాటకాన్ని, జన సమూహాలను బలోపేతం చేయడం.

దీర్ఘకాలిక పర్యాటకం అభివృద్ధికి చర్యలు. సుస్థిరమైన పర్యాటకాభివృద్ధికి బాటలు.. పర్యాటక రంగంలో ఉండే వారికి శిక్షణ..వారిలో నైపుణ్యాలు పెంపొందేలా తీర్చిదిద్దడం..పర్యాటక ప్రాంతాల్లో అంతర్జాతీయ మౌలిక వసతుల కల్పన.. ప్రపంచ స్థాయి అనుభవాలను పర్యాటకులకు అందించడం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పర్యాటకుల గమ్యస్థానంగా తీర్చిదిద్దడం.. అగ్రస్థానంలో నిలబెట్టడం . స్థిరమైన పర్యాటకాభివృద్ధికి చర్యలు.. బాధ్యతాయుతమైన పర్యాటకానికి శ్రీకారం..రివర్ క్రూయిజ్ లు, అధ్యాత్మిక పర్యాటకం, ఎకో, వెల్ నెస్, హెరిటేజ్, అడ్వెంచర్, బీచ్ టూరిజం ల అభివృద్ధి..

విశాఖపట్టణం, తిరుపతి, అరకు వ్యాలీ, రాజమండ్రి, అమరావతి, శ్రీశైలం, గండికోట ప్రాంతాల్లో యాంకర్ హబ్ ల ఏర్పాటు. 25కు పైగా థీమాటిక్ సర్క్యూట్ లు.. అందులో 2 బుద్దిస్ట్ సర్క్యూట్ లు, 10 టెంపుల్ సర్క్యూట్ లు, 5 బీచ్ సర్క్యూట్ లు, 4 రివర్ క్రూయిజ్ సర్క్యూట్ లు, 3 ఎకో టూరిజం సర్క్యూట్ లు, 2 సీ క్రూయిజ్ సర్క్యూట్ లు, సీప్లేన్ సర్క్యూట్ లు ఏర్పాటు..

రాష్ట్రంలో 40 బౌద్ధ స్మారక చిహ్నాలు, చారిత్రక మహాయాన బౌద్ధ మతం జన్మ స్థలంగా ప్రాముఖ్యత, గొప్ప బౌద్ద వారసత్వంను, చారిత్రక, పురావస్తు అభివృద్ధి చేసేందుకు చర్యలు.. అందులో భాగంగా విశాఖపట్టణం, శాలిహుండం, తొట్ల కొండ, బొజ్జన కొండ, అమరావతి స్థూపం, ఉండవల్లి గుహలు, నాగార్జున కొండ ప్రధానమైనవి..

అధ్యాత్మిక పర్యాటక సర్క్యూట్ లో భాగంగా స్థానికంగా ఉన్న జ్యోతిర్లింగాలు, శక్తిపీఠాలు, శైవక్షేత్రాలు తదితర ఆలయాలు కలిసేలా సర్క్యూట్ లు.. ..సింహాచలం, శ్రీశైలం, అహోబిలం, అన్నవరం, తిరుపతి, కాణిపాకం, లేపాక్షి, విజయవాడ, ద్వారకాతిరుమల, శక్తి పీఠాల అభివృద్ధి..

రాష్ట్రంలో విశాలమైన 974 కి.మీల సముద్రతీర ప్రాంతంలో బీచ్ టూరిజం అభివృద్ధి.. విశాఖపట్టణం, శ్రీకాకుళం, కాకినాడ, నెల్లూరు, మచిలీపట్నంలలో బీచ్ సర్క్యూట్ లు అభివృద్ధి చేసేందుకు చర్యలు..
గోదావరి, కృష్ణా నది ప్రాంతాల్లో విహార యాత్రలకు అనుకూలమైన వాతావరణం సృష్టించడం. పర్యాటకులను ఆకర్షించేలా రివర్ క్రూయిజ్ సర్క్యూట్ ల అభివృద్ధి చేయ‌డం.

పర్యావరణహిత, బాధ్యతాయుత పర్యాటకం అభివృద్ధికి శ్రీకారం..జీవ వైవిధ్యాన్ని పరిరక్షించేలా, కాలుష్యాన్ని తగ్గించేలా చర్యలు.. ఎకో టూరిజం సర్క్యూట్ ల అభివృద్ధిలో భాగంగా శ్రీకాకుళం – విశాఖపట్నం, తూర్పుగోదావరి -గుంటూరు, కర్నూలు – నెల్లూరు సర్క్యూట్ లకు సన్నాహాలు.

అందులో భాగంగా అరకులోయ, బెలూం గుహలు, నల్లమల్ల ప్రాంతాల్లో వన్యప్రాణుల సంరక్షణకు ప్రాముఖ్యత, కొండపల్లి ఫారెస్ట్, గండికోట, ఎర్రమట్టి దిబ్బలు, పాపికొండలు, కడియం నర్సరీల అభివృద్ధి..ఇప్పటికే ఎకో టూరిజం అభివృద్ధికి సబ్ కమిటీ ఏర్పాటు..

ఫిల్మ్ టూరిజం అభివృద్ధిలో భాగంగా ఫిల్మ్ మేకర్ లను ఆకర్షించేలా ఫిల్మ్ స్టూడియోల ఏర్పాటు..షూటింగ్ లకు అనుకూలమైన లొకేషన్ల గుర్తింపు..ఫిల్మ్ ఫెస్టివల్స్ నిర్వహించడం, ఫిల్మ్ టూరిజం సర్క్యూట్ ల అభివృద్ధి.. ప్రసిద్ధ షూటింగ్ స్పాట్ లను టూరిజం ప్యాకేజీలుగా అనుసంధానించడం, సింగిల్ విండో ఏర్పాటు ద్వారా ఫిల్మ్ పర్మిట్ల కోసం క్లియరెన్స్ సిస్టమ్ ఏర్పాటు చేయడం

అంతర్జాతీయ ప్రాంతాలకు ఎయిర్ కనెక్టివిటీ, హెలీ టూరిజంల అభివృద్ధి, పర్యాటకుడు కేంద్రంగా ప్రజా రవాణా మెరుగుపర్చడం, ప్రయాణం సాఫీగా సాగేలా నాణ్యత గల హైవేలు అభివృద్ధి చేయడం. రివర్ ఫ్రంట్ ఏరియాను అభివృద్ధి చేయడం, గార్డెన్స్, ఎకో ఫ్రెండ్లీ బోటింగ్ ఏర్పాటు చేయడం, ఎలక్ట్రిక్ బోట్లు ప్రవేశపెట్టడం జల పర్యావరణ వ్యవస్థను కాపాడేందుకు చర్యలు తీసుకోవడం.

పర్యాటక ప్రాంతాల్లో పరిశుభ్రతకు పెద్దపీట వేయడం..సరైన నిర్వహణకు చర్యలు . పర్యాటకుల భద్రతకు అధిక ప్రాధాన్యత కల్పించడం తదితర అంశాలతో పాలసీ రూపకల్పన చేప‌ట్టింది ఏపీ స‌ర్కార్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *