కాంగ్రెస్ మోసం హరీశ్ ఆగ్రహం
చీటింగ్ కేసు పెట్టాలని డిమాండ్
హైదరాబాద్ – మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల పేరుతో నాలుగున్నర కోట్ల ప్రజానీకాన్ని మోసం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో కేసీఆర్ సారథ్యంలో అన్ని రంగాలలో తెలంగాణను అభివృద్ది చేయడం జరిగిందన్నారు. కానీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అబద్దపు హామీలను నమ్మడం వల్లనే తాము ఓటమి పాలయ్యామని పేర్కొన్నారు హరీశ్ రావు.
తమకు కాంగ్రెస్ పార్టీకి మధ్య కేవలం ఓట్ల శాతం తక్కువేనని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఖాళీగా ఉన్న జాబ్స్ ను భర్తీ చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ ఇచ్చిన పాపాన పోలేదన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై అరెవై రోజులు పూర్తయినా ఇప్పటి వరకు ఉద్యోగాల జాడేది అని ప్రశ్నించారు తన్నీరు హరీశ్ రావు. వెంటనే ఉద్యోగాల క్యాలెండర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు . వెంటనే ప్రజలకు వివరణ ఇవ్వాలని కోరారు. నమ్మించి మోసం చేసినందుకు ప్రభుత్వంపై చీటింగ్ కేసు పెట్టాలని అన్నారు.