ఎన్నికలకు సన్నద్దం కండి
పిలుపునిచ్చిన మాజీ సీఎం
హైదరాబాద్ – అధికారం పోయిందన్న బాధను పక్కన పెట్టండి. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధం కావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు బీఆర్ఎస్ బాస్, మాజీ సీఎం కేసీఆర్. హైదరాబాద్ లోని నంది హిల్స్ లో ఉంటున్న మాజీ ముఖ్యమంత్రిని కలిసేందుకు ప్రజా ప్రతినిధులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, వివిధ జిల్లాల స్థాయిలో ఉన్న బాధ్యతులంతా క్యూ కట్టారు.
వీరంతా మర్యాద పూర్వకంగా కలుసుకున్నామని స్పష్టం చేశారు. ప్రస్తుత లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను 17 స్థానాలలో గెలిపించేందుకు తామంతా కృషి చేస్తామని చెప్పారు. ఇదిలా ఉండగా మాజీ సీఎం కేసీఆర్ ను కలుసుకున్న నేతలలో ప్రభుత్వ మాపీ చీఫ్ విప్ దాస్య వినయ్ భాస్కర్, మాజీ మంత్రులు జగదీశ్ రెడ్డి, సత్యవతి రాథోడ్ , మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, చిరుమర్తి లింగయ్య, రవీంద్ర నాయక్ , ఎమ్మెల్సీ వెంకట్రాం రెడ్డి, పిర్జాదిగూడ మేయర్ జక్కావెంకట్రెడ్డి, తదితర పార్టీ నేతలు ఉన్నారు.
ఇదిలా ఉండగా నేతలు కలుసుకున్న అనంతరం ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు (వెంకట రమణా రెడ్డి ) కేసీఆర్ ను కలుసుకున్నారు. ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.