ఏపీపై ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్
తప్పిన భారీ వర్షాల ముప్పు
అమరావతి – ఏపీ వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల వైపు వచ్చిన ఫెంగల్ తుఫాన్ ప్రభావం రాష్ట్రంపై పెద్దగా ఉండక పోవచ్చని తెలిపారు వాతావరణ శాఖ డైరెక్టర్ డాక్టర్ రోణంకి కూర్మనాథ్.
వాయు గుండంగా బలపడే అల్పపీడనం శ్రీలంక, తమిళనాడు వైపు తీరం దాటనుందని పేర్కొన్నారు. ఈ ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, దక్షిణ కోస్తా, రాయలసీమలో మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించారు.
ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రత్యేకించి పంటలు సాగు చేసుకునే రైతులు, చేపల వేటకు వెళ్లే మత్స్య కార్మికులు జాగ్రత్తగా ఉండాలని, ఎవరూ చేపల వేటకు వెళ్లవద్దని కోరారు డాక్టర్ రోణంకి కూర్మనాథ్.
అవసరమైతే తప్పా బయటకు రావద్దని సూచించారు. అంత మేర ప్రభావం ఉండక పోవచ్చని పేర్కొన్నారు.