సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాలి
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపు
మహబూబ్ నగర్ జిల్లా – రాబోయే సార్వత్రిక (లోక్ సభ) ఎన్నికల్లో సత్తా చాటాలని పిలుపునిచ్చారు రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో జరిగిన సభలో ప్రసంగించారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలోని 17 లోక్ సభ స్థానాలను తప్పకుండా గెలుచు కోవాలని అన్నారు. ప్రతి ఒక్కరు కలిసికట్టుగా అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటినట్లు గానే ఎంపీలను కూడా లోక్ సభకు పంపించాలని పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా వంశీ చందర్ రెడ్డి తనకు ప్రియమైన మిత్రుడని పేర్కొన్నారు.
అసెంబ్లీలో ఒక వెలుగు వెలిగారని కొనియాడారు. ఐదేళ్ల పాటు కష్ట పడ్డారని , మళ్లీ ప్రజల కోసం పాదయాత్ర చేపట్టారని అన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, కేసీ వేణు గోపాల్ కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారని ప్రశంసలు కురిపించారు.
మహబూబ్ నగర్ లోక్ సభ పార్టీ నుంచి వంశీ చందర్ రెడ్డి బరిలో ఉండ బోతున్నారని , తప్పకుండా భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.