మంత్రి సత్య కుమార్ యాదవ్ ప్రశంస
అమరావతి : భారత దేశం గర్వించ దగిన అరుదైన నాయకుడు అటల్ బిహారి వాజ్ పేయి అని ప్రశంసలు కురిపించారు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్. అమరావతిలో నిర్వహించిన అటల్–మోదీ సుపరిపాలన యాత్ర ముగింపు కార్యక్రమం జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి శివ రాజ్ సింగ్ చౌహాన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తో పాటు మంత్రులు కందుల దుర్గేష్, సత్య కుమార్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్బంగా బహిరంగ సభలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. దేశానికి సుపరిపాలన అందించింది వాజ్‌పేయి అని, అందుకే ఆయన జయంతి రోజును సుపరిపాలన దినోత్సవం గా దేశ వ్యాప్తంగా నిర్వహిస్తూ వస్తున్నట్లు తెలిపారు సత్య కుమార్ యాదవ్.
సామాన్య స్థాయి నుంచి అసామాన్య స్థాయికి ఎదిగి, ఎలాంటి పరిస్థితులనైనా చిరునవ్వుతో ఎదుర్కొని నిలబడిన మహానుభావుడు వాజ్‌పేయి అని పేర్కొన్నారు. ఎయిర్‌పోర్టులు, జాతీయ రహదారులు, ఐటీ, టెలికం వంటి రంగాల్లో కనెక్టివిటీ విప్లవానికి నాంది పలికిన నేత అని కొనియాడారు. సౌమ్యునిగా పేరున్న వాజ్‌పేయి దేశ భద్రత విషయంలో మాత్రం ఏనాడూ రాజీ పడలేదని స్పస్టం చేశారు మంత్రి సత్య కుమార్ యాదవ్. అటల్ జీ ఇచ్చిన స్పూర్తిని కొనసాగిస్తూ భారత దేశాన్ని ప్రపంచంతో పోటీ పడేలా చేస్తున్నారంటూ ప్రధానమంత్రి దామోదర దాస్ మోదీపై ప్రశంసల జల్లులు కురిపించారు.






