NEWSANDHRA PRADESH

వైసీపీ దుష్ప్ర‌చారం సునీత ఆగ్ర‌హం

Share it with your family & friends

సైబ‌రాబాద్ పోలీసుల‌కు ఫిర్యాదు

అమ‌రావ‌తి – దివంగ‌త వైఎస్ వివేకానంద రెడ్డి త‌న‌యురాలు డాక్ట‌ర్ వైఎస్ సునీత తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌న‌తో పాటు ఏపీ పీసీసీ చీఫ్ ష‌ర్మిలా రెడ్డి, వైఎస్ విజ‌య‌మ్మ ల‌పై కొంద‌రు ప‌ని గ‌ట్టుకుని సామాజిక మాధ్య‌మాల వేదిక‌గా వ్య‌తిరేక ప్ర‌చారం చేయ‌డాన్ని త‌ప్పు ప‌ట్టారు. వ్య‌క్తిగ‌తంగా అస‌భ్య‌క‌ర‌మైన రీతిలో పోస్టులు పెడుతున్నార‌ని, ప్ర‌ధానంగా ఏపీలో కొలువు తీరిన వైసీపీ నేత‌లు కావాల‌ని డ్యామేజ్ చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ ఆరోపించారు.

వైఎస్ సునీత మీడియాతో మాట్లాడారు. త‌మ ముగ్గురిపై అభ్యంత‌ర‌క‌రంగా, అవ‌మాన‌క‌రంగా పోస్టులు పెడుతున్నారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు వారు ఎవ‌రో తెలుసు కోవాల‌ని, అలా చేయ‌కుండా చూడాల‌ని కోరారు పోలీసుల‌ను.

‘వర్రా రవీంద్రారెడ్డి’ పేరుతో ఉన్న ఫేస్‌బుక్‌ ఖాతాలో తనకు, వైఎస్‌ షర్మిలకు, వైఎస్‌ విజయమ్మకు వ్యతిరేకంగా తీవ్ర అభ్యంతరకర, అసహ్యకరమైన, హత్యా బెదిరింపులతో పాటు రెచ్చ గొట్టే లా పోస్టులు పెడుతున్నారని ఆమె ఆరోపించారు.