28న డయల్ యువర్ టీటీడీ ఈవో
వెల్లడించిన టీటీడీ పాలకమండలి
టీటీడీ కీలక ప్రకటన చేసింది. టీటీడీ ‘డయల్ యువర్ ఈవో’ కార్యక్రమం డిసెంబరు 28వ తేదీ ఉదయం 9 నుండి 10 గంటల వరకు తిరుమల అన్నమయ్య భవనంలో జరుగనుంది. ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.
ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టీటీడీ ఈవో జె.శ్యామలరావు కు ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చని సూచించింది టీటీడీ. ఇందుకు భక్తులు 0877-2263261 అనే నెంబర్ కు ఫోన్ చేయాలని పేర్కొంది.
ఇదిలా ఉండగా టీటీడీ పాలక మండలి నిత్యం తిరుమల పుణ్య క్షేత్రానికి వేలాది మంది వస్తుంటారు. కోట్లాది రూపాయల ఆదాయం హుండీ ద్వారా వస్తోంది. ఈ సందర్బంగా పెద్ద ఎత్తున వసతి సౌకర్యాలను ఏర్పాటు చేస్తోంది.
తాజాగా కొత్తగా కొలువు తీరింది పాలకవర్గం. సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రతి నెలా మంగళవారం తిరుపతి స్థానికులకు స్వామి వారి దర్శనం కల్పించే సౌకర్యం తిరిగి ఏర్పాటు చేశారు.