NEWSANDHRA PRADESH

నాశ‌నం చేసిన బాబు బ‌తికించిన జ‌గ‌న్

Share it with your family & friends

స‌ర్వ నాశ‌నం చేసిన చంద్ర‌బాబు

అమ‌రావ‌తి – ఏపీలో రాజ‌కీయ వేడి రాజుకుంది. అధికారంలో ఉన్న వైసీపీ దూకుడు పెంచింది. ఏపీ సీఎం జ‌గ‌న్ రెడ్డి వై నాట్ 175 అనే నినాదంతో ముందుకు వెళుతున్నారు. ఈ త‌రుణంలో తాము అమ‌లు చేస్తున్న న‌వ ర‌త్రాలు త‌మ‌ను గ‌ట్టెక్కిస్తాయ‌ని గ‌ట్టిగా న‌మ్మ‌కంతో ఉన్నారు.

ఈ సంద‌ర్బంగా ఆర్టీసిని ఎవ‌రు నాశ‌నం చేశారో రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ముఖ్యంగా ఆర్టీసీ ఉద్యోగుల‌కు, సిబ్బందికి తెలుస‌ని వైసీపీ పేర్కొంది. బాబు హ‌యంలో ఆర్టీసిని స‌ర్వ నాశ‌నం చేశాడ‌ని, ఉద్యోగుల‌ను రోడ్డున ప‌డేశాడ‌ని ఆరోపించింది.

ఆర్టీసీ సంస్థ‌ను న‌ష్టాల‌లోకి నెట్టేసి దానిని కార‌ణంగా చూపించి ఆర్టీసీని ప్రైవేట్ ప‌రం చేసి , సంస్థ‌కు చెందిన ఆస్తుల‌ను త‌న బినామీల‌కు క‌ట్ట బెట్టాల‌ని చూశాడ‌ని మండిప‌డింది.

ఇదే స‌మ‌యంలో చంద్ర‌బాబు దిగి పోయాడ‌ని, అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వెంట‌నే ఆర్టీసిని ప్ర‌భుత్వంలో క‌లిపాడ‌ని, సిబ్బందిని శాశ్వ‌త ఉద్యోగులుగా మార్చేశాడ‌ని, పాత బ‌స్సుల‌ను ర‌వాణా వాహ‌నాలుగా మార్చిన ఘ‌న‌త ఆయ‌న‌కే ద‌క్కింద‌ని తెలిపింది.

ప్ర‌స్తుతం ఆర్టీసి గాడిలో ప‌డింద‌ని, స‌క్సెస్ బాట‌లో న‌డుస్తోంద‌ని ఇంత‌కంటే ఇంకేం కావాల‌ని ప్ర‌శ్నించింది.